బూతు.. పుజారాని అసభ్య పదజాలంతో తిట్టిన రోహిత్ శర్మ..

Rohit Sharma absues Pujara : స్పిన్ బౌలింగ్‌లో సింగిల్ తీసేందుకు బంతిని పుష్ చేసిన రోహిత్.. సింగిల్ తీసేందుకు ఓ అడుగు ముందుకేశాడు. మరో ఎండ్‌లోఉన్న పుజారా కూడా ఓ అడుగు ముందుకేశాడు. ఇంతలో బంతి ఫీల్డర్ చేతిలోకి వెళ్లడంతో పుజారా సింగిల్‌కి 'నో' చెప్పాడు.

news18-telugu
Updated: October 5, 2019, 4:18 PM IST
బూతు.. పుజారాని అసభ్య పదజాలంతో తిట్టిన రోహిత్ శర్మ..
రోహిత్ శర్మ
news18-telugu
Updated: October 5, 2019, 4:18 PM IST
దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌లో పరుగుల వరద పారిస్తున్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ.. నాలుగు రోజు ఆటలో సహనం కోల్పోయాడు. తాను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. మరో ఎండ్‌లో ఉన్న చటేశ్వర్ పుజారాను తిట్ల దండకం అందుకున్నాడు. సింగిల్‌‌ తీసేందుకు పుజారా నిరాకరించడంతో సహనం కోల్పోయి నోటికి పనిచెప్పాడు. రోహిత్ పుజారాను తిట్టడం స్టంప్ మైక్‌లో స్పష్టంగా రికార్డయింది. దీంతో పలువురు నెటిజెన్స్ ఆ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు.

స్పిన్ బౌలింగ్‌లో సింగిల్ తీసేందుకు బంతిని పుష్ చేసిన రోహిత్.. సింగిల్ తీసేందుకు ఓ అడుగు ముందుకేశాడు. మరో ఎండ్‌లోఉన్న పుజారా కూడా ఓ అడుగు ముందుకేశాడు. ఇంతలో బంతి ఫీల్డర్ చేతిలోకి వెళ్లడంతో పుజారా సింగిల్‌కి 'నో' చెప్పాడు. దీంతో సహనం రోహిత్ సహనం కోల్పోయి అసభ్య పదజాలంతో తిట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే, 71 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో బరిలో దిగిన టీమిండియా.. నాలుగో రోజు ఆటలోనూ ఆధిక్యం కనబరుస్తోంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(7) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినప్పటికీ.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ ధాటిగా ఆడి మరో సెంచరీ నమోదు చేశాడు.ప్రస్తుతం రవీంద్ర జడేజా(23),విరాట్ కోహ్లి(19) క్రీజులో ఉన్నారు. టీమిండియా 354 పరుగుల ఆధిక్యంలో ఉంది.


First published: October 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...