టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ చిత్రాన్ని కరెన్సీపై ముద్రించిన స్విస్ ప్రభుత్వం

స్విస్ కరెన్సీలోని 20 ఫ్రాంక్‌ల వెండి నాణేనికి ముందు వైపు ఫెదరర్ చిత్రాన్ని ముద్రించారు. ఇలా మొత్తం 55 వేల నాణేలను ముద్రిస్తున్నట్టు స్విస్ ప్రభుత్వం తెలిపింది.


Updated: December 4, 2019, 10:44 PM IST
టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ చిత్రాన్ని కరెన్సీపై ముద్రించిన స్విస్ ప్రభుత్వం
రోజర్ ఫెదరర్ (Image: Twitter)
  • Share this:
ప్రపంచ టెన్నిస్‌ దిగ్గజం రోజర్ ఫెదరర్‌ను స్విట్జర్లాండ్ ప్రభుత్వం అరుదైన గౌరవంతో సత్కరించింది. అతడి పేరిట స్విస్ కరెన్సీలోని 20 ఫ్రాంక్‌ల వెండి నాణేనికి ముందు వైపు ఫెదరర్ చిత్రాన్ని ముద్రించారు. ఇలా మొత్తం 55 వేల నాణేలను ముద్రిస్తున్నట్టు స్విస్ ప్రభుత్వం తెలిపింది. అంతేగాక వచ్చే ఏడాది మే నెలలో మరో 40 వేల నాణేలను కూడా అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ప్రపంచ టెన్నిస్‌కు ఫెదరర్ అందించి సేవలు మరువలేనివని ఈ సందర్భంగా పొగడ్తల్లో ముంచెత్తారు. చరిత్రలోనే గొప్ప క్రీడాకారుడిని ఇలా అరుదైన గౌరవంతో సత్కరించడం గొప్ప అనుభూతిని ఇస్తోందని స్విస్ ప్రభుత్వం వెల్లడించింది.

First published: December 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>