హోమ్ /వార్తలు /క్రీడలు /

Wimbledon : రోజర్ ఫెదరర్, నోవాక్ జకోవిచ్ రికార్డులు..రూబ్లెవ్‌కు షాక్.. క్వార్టర్ ఫైనల్స్ చేరింది వీళ్లే..!

Wimbledon : రోజర్ ఫెదరర్, నోవాక్ జకోవిచ్ రికార్డులు..రూబ్లెవ్‌కు షాక్.. క్వార్టర్ ఫైనల్స్ చేరింది వీళ్లే..!

వింబుల్డన్‌లో జకోవిచ్, ఫెదరర్ రికార్డులు చూశారా?

వింబుల్డన్‌లో జకోవిచ్, ఫెదరర్ రికార్డులు చూశారా?

వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ చివరి వారానికి చేరుకున్నది. జకోవిచ్, ఫెదరర్, బార్టీ, ప్లిస్కోవా క్వార్టర్ ఫైనల్స్ చేరుకున్నారు.

వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ (Wimbledon Grandslam) టోర్నీ క్వార్టర్ ఫైనల్స్ వరకు చేరుకున్నది. సోమవారం రాత్రి సెంటర్ కోర్టులో జరిగిన మ్యాచ్‌లో వరల్డ్ నెంబర్ 1 నోవాక్ జకోవిచ్ (Novak Djokivic) 6-2, 6-4, 6-2 తేడాతో చిలీకి చెందిన క్రిస్టియన్ గారిన్‌పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. నోవాక్ జకోవిచ్ తన కెరీర్‌లో మేజర్ టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ చేరడం ఇది 50వ సారి. గతంలో ఎవరూ ఈ ఫీట్ అందుకోలేదు. అంతకు ముందు వరల్డ్ నెంబర్ 8, దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ (Roger Federer) 7-6(7/1), 6-1, 6-4 తేడాతో రిచర్డ్ గాస్కెట్‌పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. వింబుల్డన్‌లో మూడో రౌండ్ దాటిని అత్యంత పెద్ద వయస్కుడిగా రోజర్ ఫెదరర్ రికార్డు సృష్టించాడు. ఫెదరర్ 37 ఏళ్ల వయసులో నాలుగో రౌండ్ చేరుకున్నాడు. గత 47 ఏళ్ల వింబుల్డన్ చరిత్రలో అత్యధిక వయసులో నాలుగో రౌండ్ చేరిన ప్లేయర్‌గా ఫెదరర్ రికార్డులకు ఎక్కాడు. గతంలో 1975లో ఆస్ట్రేలియాకు చెందిన కెన్ రోజ్ వాల్ 40 ఏళ్ల వయసులో మూడో రౌండ్ దాటాడు.

పురుషుల సింగిల్స్‌లో రష్యాకు చెందిన కరెన్ కచానొవ్ 3-6, 6-4, 6-3, 5-7, 10-8 తేడాతో అమెరికాకు చెందిన సెబాస్టియన్ కోర్దాపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరాడు. 10వ సీడ్ కెనడియన్ డెనిస్ షపోవలోవ్ 6-1, 6-3, 7-5 తేడాతో స్పెయిన్‌కు చెందిన బటిస్టా అగత్‌ను ఓడించాడు. ఇటలీకి చెందిన 7వ సీడ్ మాటియో బెరెటినీ 6-4, 6-3, 6-1 తేడాతో బల్గేరియాకు చెందిన ఇలియా ఇవాష్క పై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరాడు. 5వ ర్యాంకర్ ఆండ్రీ రుబ్లెవ్‌కు అన్‌సీడెడ్ ఆటగాడు మార్టన్ ఫసోవిక్స్ షాకిచ్చాడు. ప్రీ క్వార్టర్స్‌లో రుబ్లెవ్‌పై ఫసోవిక్స్ 6-3, 4-6, 6-0, 6-3 తేడాతో విజయం సాధించాడు.


మహిళల సింగిల్స్‌లో వరల్డ్ నెంబర్ 1 ఆష్ బార్టీ 7-5, 6-3 తేడాతో 14వ సీజ్ బార్బారా క్రెజికోవాపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరుకున్నది. చెక్ రిపబ్లిక్‌కు చెందిన కరోలినా ప్లిస్కోవా 6-2, 6-3 తేడాతో రష్యాకు చెందిన శాంసనోవాపై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరింది. ట్యునీషియాకు చెందిన ఒనస్ జబేర్ 5-7, 6-1, 6-1 తేడాతో పోలాండ్‌కు చెందిన 7వ ర్యాంకర్ ఇగ స్వైటెక్‌పై గెలిచి క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. 2వ ర్యాంక్ అరీనా సబలెంక 6-3, 4-6, 6-3 తేడాతో ఎలీనా రిబకీనాపై గెలిచింది. 19వ సీడ్ కరోలినా ముచోవా 7-6, 6-4 తేడాతో పౌలా డబోసాపై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరుకున్నది. అన్‌సీడ్ క్రీడాకారిణి విక్టోరియా గోల్బిక్ 23వ సీడ్ అమెరికన్ మాడిసన్ కీస్‌పై 7-6, 6-3 తేడాతో గెలిచింది. 25వ ర్యాంకర్ ఆంజిలిక్ కెర్బర్‌పై 6-4, 6-4 తేడాతో 20వ సీడ్ అమెరికన్ కోకోగాఫ్ పై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరుకున్నది.

First published:

Tags: Novak Djokovic, Roger Federer, Tennis, Wimbledon

ఉత్తమ కథలు