హోమ్ /వార్తలు /క్రీడలు /

Roger Federer : డబుల్స్ బరిలో నడాల్, ఫెడరర్.. కలిసి రచ్చ రచ్చ చేయనున్న దిగ్గజాలు

Roger Federer : డబుల్స్ బరిలో నడాల్, ఫెడరర్.. కలిసి రచ్చ రచ్చ చేయనున్న దిగ్గజాలు

PC : TWITTER

PC : TWITTER

Roger Federer : టెన్నిస్ దిగ్గజం, 20 గ్రాండ్ స్లామ్ టైటిల్ వీరుడు రోజర్ ఫెడరర్ (Roger Federer) ఆటకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 23న జరిగే టీం ఈవెంట్ రాడ్ లేవర్ కప్ (Rod Laver Cup ) 2022 తనకు చివరి టోర్నీమెంట్ అంటూ ఫెడరర్ గత వారం ప్రకటించాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Roger Federer : టెన్నిస్ దిగ్గజం, 20 గ్రాండ్ స్లామ్ టైటిల్ వీరుడు రోజర్ ఫెడరర్ (Roger Federer) ఆటకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 23న జరిగే టీం ఈవెంట్ రాడ్ లేవర్ కప్ (Rod Laver Cup ) 2022 తనకు చివరి టోర్నీమెంట్ అంటూ ఫెడరర్ గత వారం ప్రకటించాడు. రాడ్ లేవర్ కప్ మొత్తానికి ఫెడరర్ అందుబాటులో లేడని సమాచారం. మొదటి రోజు జరిగే డబుల్స్ మ్యాచ్ తర్వాత అతడు మళ్లీ రాకెట్ పట్టలేదని సమాచారం. దాంతో ఈ మ్యాచ్ ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక డబుల్స్ మ్యాచ్ లో మరో దిగ్గజ ప్లేయర్ రాఫెల్ నడాల్ (Rafael Nadal)తో కలిసి రోజర్ బరిలోకి దిగనున్నాడు. వీరిద్దరు టీం యూరప్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరు టీం వరల్డ్ కు చెందిన టియాఫే-జాక్ సాక్ జంటతో తలపడనుంది.

ఇక ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి గం . 12.30 లకు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ ను సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. దాంతో పాటు సోనీ లివ్ లో కూడా మ్యాచ్ ను చూడొచ్చు. రాడ్ లేవర్ కప్ ప్రతి ఏటా జరుగుతుంది. ఇందులో టీం యూరప్, టీం వరల్డ్ జట్లు తలపడతాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ మ్యాచ్ లో రోజుకు మూడు సింగిల్స్, ఒక డబుల్స్ పద్ధతిన మొత్తం నాలుగు మ్యాచ్ లు జరుగుతాయి. తొలి రోజు ప్రతి మ్యాచ్ లో గెలిచిన జట్టుకు ఒక్కో పాయింట్ చొప్పున.. రెండో రోజు గెలిచిన ప్రతి మ్యాచ్ కు రెండు పాయింట్ల చొప్పున.. మూడో రోజు గెలిచిన ప్రతి మ్యాచ్ కు మూడు పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. ఇలా ఏ జట్టు అయితే 13 పాయింట్లను ముందుగా సాధిస్తుందో ఆ జట్టును విజేతగా ప్రకటిస్తారు. టీం యూరప్ లో ఫెడరర్, నడాల్ లతో పాటు నొవాక్ జొకోవిచ్ కూడా ఉన్నాడు. బిగ్ త్రీ గా వీరిని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. ఈ ముగ్గురు ప్లేయర్స్ 63 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలవడం విశేషం. అయితే తొలి రోజు జొకోవిచ్ పోటీలో లేడు.

జట్లు

టీం యూరప్

ఫెడరర్, నడాల్, జొకోవిచ్, ఆండీ ముర్రే, క్యాస్పర్ రూడ్, సిట్సిపాస్.

టీం వరల్డ్

ఫెలిక్స్, టియాఫే, జాక్ సాక్, డియాగో స్వార్ట్జ్ మన్, అలెక్స్ డి మినార్, టేలర్ ఫ్రిట్జ్

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, French open, Hardik Pandya, India vs australia, Jasprit Bumrah, Novak Djokovic, Rafael Nadal, Roger Federer, Rohit sharma, Serena Williams, Team India, Us open, Virat kohli, Wimbledon

ఉత్తమ కథలు