హోమ్ /వార్తలు /క్రీడలు /

Road Safety World Series 2022 : 49 ఏళ్ల వయసులోనూ ఏ మాత్రం తగ్గని దూకుడు.. 1998 సచిన్ ను గుర్తు చేసిన క్రికెట్ దేవుడు

Road Safety World Series 2022 : 49 ఏళ్ల వయసులోనూ ఏ మాత్రం తగ్గని దూకుడు.. 1998 సచిన్ ను గుర్తు చేసిన క్రికెట్ దేవుడు

PC : Tendulkar

PC : Tendulkar

Road Safety World Series 2022 : క్రికెట్ కు గుడ్ బై చెప్పి 10 ఏళ్లు కావొస్తుంది. వయసు 49. అయినా క్రికెట్ దేవుడి టెక్నిక్ ఏ మాత్రం తగ్గలేదు. స్ట్రోక్ ప్లేతో పాత రోజులను గుర్తు చేస్తున్నాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Road Safety World Series 2022 : క్రికెట్ కు గుడ్ బై చెప్పి 10 ఏళ్లు కావొస్తుంది. వయసు 49. అయినా క్రికెట్ దేవుడి టెక్నిక్ ఏ మాత్రం తగ్గలేదు. స్ట్రోక్ ప్లేతో పాత రోజులను గుర్తు చేస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ (Road Safety World Series ) 2022 రెండో సీజన్ లో భారత లెజెండ్స్ (India Legends) జట్టుకు కెప్టెన్ గా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) వ్యవహరిస్తున్నాడు. డెహ్రాడూన్ వేదికగా ఇంగ్లండ్ లెజెండ్స్ (England Legends)తో జరిగిన మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్ ఒక 25 ఏళ్లు వెనక్కి వెళ్లాడు. 1998 షార్జాలో సచిన్ టెండూల్కర్ ను గుర్తు చేశాడు. 49 ఏళ్ల వయసులోనూ తనకే సాధ్యమయ్యే షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై రెచ్చిపోయాడు. కేవలం 20 బంతుల్లోనే 40 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం. ఫలితంగా భారత్ 40 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పై ఘనవిజయం సాధించింది.

వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను 15 ఓవర్ల చొప్పున కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 15 ఓవర్లలో 5 వికెట్లకు 170 పరుగులు చేసింది. సచిన్ ధనాధన్ బ్యాటింగ్ కు యువరాజ్ సింగ్ (15 బంతుల్లో 31 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు), యూసఫ్ ఫఠాన్ (11 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్సర్లు) కూడా తోడవ్వడంతో భారత్ భారీ స్కోరును సాధించింది. ఇక మ్యాచ్ లో సచిన్ బ్యాటింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఫుల్ షాట్, స్కూప్,  స్వీప్, లాఫ్టడ్ షాట్, పిచ్ మీదకు దూసుకువెళ్లి లాంగాన్ మీదుగా ఇలా భారీ షాట్లు ఆడాడు. దీనికి సంబంధించిన వీడియోలు ట్విట్టర్ , యూట్యూబ్ లలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

భారీ టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ జట్టు 15 ఓవర్లలో 6 వికెట్లకు 130 పరుగులు చేసింది.  రాజేశ్ పవార్ 3 వికెట్లు తీశాడు. ఫిల్ మస్టర్డ్ (29), క్రిస్ ట్రెమ్లెట్ (24) ఫర్వాలేదనిపించారు.  మొత్తం 8 జట్లు ఈ సిరీస్ లో పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడిన భారత్.. రెండింటిలో నెగ్గింది. మరో రెండు మ్యాచ్ లు రద్దయ్యాయి. దాంతో భారత్ 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. శ్రీలంక ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ నెగ్గి 12 పాయింట్లతో తొలి స్థానంలో ఉంది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Axar Patel, Dinesh Karthik, Hardik Pandya, India vs australia, Jasprit Bumrah, KL Rahul, Rishabh Pant, Rohit sharma, Sachin Tendulkar, Suresh raina, Virat kohli, Yuvraj Singh

ఉత్తమ కథలు