హోమ్ /వార్తలు /క్రీడలు /

IND L vs SL L Final : మరోసారి సచిన్ X జయసూర్య.. ఫైనల్లో ఇండియా లెజెండ్స్ వర్సెస్ శ్రీలంక లెజెండ్స్.. ఎప్పుడంటే?

IND L vs SL L Final : మరోసారి సచిన్ X జయసూర్య.. ఫైనల్లో ఇండియా లెజెండ్స్ వర్సెస్ శ్రీలంక లెజెండ్స్.. ఎప్పుడంటే?

PC : TWITTER

PC : TWITTER

Road Safety World Series 2022 IND L vs SL L Final : క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), సనత్ జయసూర్య (Sanath Jayasuriya) ప్రత్యర్థులుగా మారి ఒకరితో మరొకరు తలపడితే చూడాలని ఉందా? అయితే ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకండి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Road Safety World Series 2022 IND L vs SL L Final : క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), సనత్ జయసూర్య (Sanath Jayasuriya) ప్రత్యర్థులుగా మారి ఒకరితో మరొకరు తలపడితే చూడాలని ఉందా? అయితే ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకండి. 2000-05 నాటి క్రికెట్  జ్ఞాపకాలను గుర్తు చేసేలా వీరిద్దరూ మరోసారి క్రికెట్ మైదానంలో పోటీ పడనున్నారు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ (Road Safety World Series) 2022లో భాగంగా సెప్టెంబర్ 2 (శనివారం) జరిగే ఫైనల్ పోరులో టైటిల్ కోసం ఇండియా లెజెండ్స్ (India Legends)తో శ్రీలంక లెజెండ్స్ (Sri Lanka Legends) పోటీ పడనుంది. ఇండియా లెజెండ్స్ కు సచిన్ టెండూల్కర్ కెప్టెన్ గా ఉండగా.. శ్రీలంక లెజెండ్స్ కు తిలకరత్నే దిల్షాన్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. రాయ్ పూర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ నేటి (శనివారం) రాత్రి గం 7. 30 లకు ఆరంభం కానుంది. దీనిని కలర్స్ నినీప్లెక్స్ చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. వూట్ యాప్ లో కూడా లైవ్ చూడొచ్చు.

టైటిల్ నిలబెట్టుకుంటారా?

గతేడాది జరిగిన తొలి ఎడిషన్ లో ఇండియా లెజెండ్స్ చాంపియన్ గా నిలిచింది. అప్పుడు కూడా ఫైనల్లో శ్రీలంకతోనే భారత్ తలపడింది. అందులో నెగ్గిన భారత్ చాంపియన్ గా నిలిచింది. వరుసగా రెండో ఏడాది కూడా ఈ రెండు జట్లే ఫైనల్లో తలపడనున్నాయి. ఈసారి గెలుస్తామని శ్రీలంక కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్ ధీమా వ్యక్తం చేశాడు. ఇరు జట్లు కూడా బలంగా కనిపిస్తున్నాయి. సెమీఫైనల్స్ లో ఆస్ట్రేలియాపై భారత్.. వెస్టిండీస్ పై శ్రీలంక జట్లు విజయాలు సాధించి ఫైనల్స్ కు చేరుకున్నాయి.

భారమంతా పఠాన్ బ్రదర్స్ పైనే

అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై పలికి ఏళ్లు గడుస్తున్నా పఠాన్ బ్రదర్స్ ఇర్ఫాన్, యూసఫ్ లు ఇప్పటికీ అదరగొడుతున్నారు. ఇండియా లెజెండ్స్ విజయాల్లో వీరిద్దరూ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సెమీఫైనల్లో ఇర్ఫాన్ పఠాన్ తన ధనాధన్ ఇన్నింగ్స్ తో జట్టును ఫైనల్ కు చేర్చాడు. వీరిద్దరూ ఎలా ఆడతారనే దానిపైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, ఓజాలు ఉన్నా నిలకడగా ఆడటం లేదు. ఇక శ్రీలంక జట్టు స్పిన్నర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా సనత్ జయసూర్య తన స్పిన్ తో మాయ చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం జరిగే ఫైనల్ ఉత్కంఠ భరితంగా సాగడం ఖాయం.

తుది జట్లు (అంచనా)

టీమిండియా 

ఓజా, సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), సురేశ్ రైనా, యువరాజ్ సింగ్, స్టువర్ట్ బిన్నీ, యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, రాజేశ్ పవార్, అభిమన్యు మిథున్, మునాఫ్ పటేల్, రాహుల్ శర్మ

శ్రీలంక

మహేలా ఉదవట్టే, సనత్ జయసూర్య, దిల్షాన్ (కెప్టెన్), ఉపుల్ తరంగ, జయరత్నే, చమర సిల్వ, జీవన్ మెండిస్, చతురంగ డి సిల్వా, గుణరత్నే, ఉదాన, కులశేఖర

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Harbhajan singh, India vs South Africa, India vs srilanka, Jasprit Bumrah, Rohit sharma, Sachin Tendulkar, Suresh raina, Yuvraj Singh

ఉత్తమ కథలు