pant: పంత్‌ టూరిస్ట్‌లా ఆసీస్ వెళ్లినట్లు ఉన్నాడు.. ఇక అతను జట్టులో కనిపించాడు!

Rishabh Pant

ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో పంత్‌ను ఆడించకపోవడంపై వ్యగంగా స్పందించారు.టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా. అతను ఓ పర్యటకుడిలా ఆసీస్ టూర్‌కు వెళ్ళినట్లు ఉందని వ్యగంగా స్పందించారు.

  • Share this:
    ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో పంత్‌ను ఆడించకపోవడంపై వ్యగంగా స్పందించారు.టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా. అతను ఓ పర్యటకుడిలా ఆసీస్ టూర్‌కు వెళ్ళినట్లు ఉందని వ్యగంగా స్పందించారు. తాజాగా ఓ అభిమాని అడిగిన ప్రశ్మకు సమాధానమిస్తూ .. ఇది సమాధానం లేని ప్రశ్న. ఇప్పుడు జట్టులో ఉన్న వికెట్ కీపర్ల జాబితాలో పంత్‌ చివరి స్థానంలో ఉన్నాడన్నాడు. ఐపీఎల్ 2021 వరకు అతను టీమిండియాలో కనిపించడం చాలా కష్టమే. ఆస్ట్రేలియా ఏ టీమ్‌తో జరిగే ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో అతడికి అవకాశం ఇవ్వాలి. చివరికి అతన్ని ఆరో బ్యాట్స్‌మన్‌గానైనా ఆడించాలి. వికెట్‌ కీపర్‌గా స్థానంలో సాహాను కొనసాగించినా.. పంత్‌కు మాత్రం బ్యాట్స్‌మెన్ అవకాశం ఇవ్వాలని" చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు.

    ఇప్పటివరకు జరిగిన టీ20, వన్డే సిరీస్‌ల్లోనూ అతనికి అవకాశం ఇవ్వలేదు. అతను పర్యాటకుడిలానే ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు ఉందంటూ చోప్రా విమర్శించాడు. జట్టులో అతని స్థానం ఏంటో అర్ధం కావడంలేదని ఈ యువ బ్యాట్స్‌మన్‌ సాహాకు కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా మిగిలిపోతాడని అభిప్రాయపడ్డారు. ఇప్పటి పరిస్థితుల్లో అతను టీమిండియాలో కనిపించాలంటే ఐపీఎల్‌ 2021 వరకు వేచి చూడాలన్నారు. ఐపీఎల్ 14 ఎడిషన్‌లో విశేషంగా రాణిస్తినే మళ్ళి జాతీయ జట్టులో అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

    ముందు జరగబోయే టెస్ట్ మ్యాచ్ లో అనుహ్యంగా అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒకవేళ శతకంతో రాణించగలిగితే.. అతను వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదన్నారు. ఇప్పడు జట్టులో ఉన్న పోటిలో అతను అవకాశం దొరకడం కష్టమన్నారు. ఇక ఐపీఎల్ 13 ఎడిషన్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు.  అదృష్టం కొద్దీ శతకంతో కదం తొక్కితే ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో
    14 మ్యాచ్‌లు 31.18 సగటుతో 343 పరుగులు చేశాడు.
    Published by:Rekulapally Saichand
    First published: