Rishabh Pant : ఐసీసీ సరికొత్త అవార్డు పంత్ దే.. ఆస్ట్రేలియాలో దుమ్ము రేపినందుకు..

Risabh Pant

Rishabh Pant : అంతర్జాతీయ క్రికెట్ లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ప్రతినెలా ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఇవ్వాలని ఐసీసీ (ICC) నిర్ణయించిన విషయం తెలిసిందే. ఏడాది పొడవునా అన్ని ఫార్మాట్లలో మెన్స్‌, విమెన్స్‌ క్రికెటర్ల ఉత్తమ ప్రదర్శనల గుర్తించి క్రికెటర్ల విజయాన్ని సెలబ్రేట్‌ చేసేందుకు ఈ అవార్డులను ఇవ్వనుంది.

  • Share this:
    అంతర్జాతీయ క్రికెట్ లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ప్రతినెలా ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఇవ్వాలని ఐసీసీ (ICC) నిర్ణయించిన విషయం తెలిసిందే. ఏడాది పొడవునా అన్ని ఫార్మాట్లలో మెన్స్‌, విమెన్స్‌ క్రికెటర్ల ఉత్తమ ప్రదర్శనల గుర్తించి క్రికెటర్ల విజయాన్ని సెలబ్రేట్‌ చేసేందుకు ఈ అవార్డులను ఇవ్వనుంది. అయితే, తొలిసారి ప్ర‌వేశ‌పెట్టిన ప్లేయ‌ర్ ఆఫ్ ద మంత్ అవార్డును జ‌న‌వ‌రి నెల‌కుగాను ఇండియ‌న్ వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ ద‌క్కించుకున్నాడు. ఈ క్ర‌మంలో అత‌డు ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌, ఐర్లాండ్ ప్లేయ‌ర్ పాల్ స్టిర్లింగ్‌ల‌ను వెన‌క్కి నెట్టాడు. జ‌న‌వ‌రిలో రిష‌బ్ పంత్ టీమిండియా చారిత్ర‌క విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించిన విష‌యం తెలిసిందే. బ్రిస్బేన్ టెస్ట్‌లో 89 ప‌రుగులు చేసిన పంత్‌.. టీమ్‌కు అద్వితీయ‌మైన విజ‌యాన్ని సాధించి పెట్టిన విష‌యం తెలిసిందే. అంత‌కుముందు సిడ్నీ టెస్ట్‌లోనూ 97 ప‌రుగులు చేసిన పంత్‌.. ఆ మ్యాచ్ డ్రాగా ముగియ‌డంలో త‌న వంతు పాత్ర పోషించాడు. ఈ రెండు టెస్టుల్లోనూ క్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లో పంత్ ఆడిన తీరు అద్భుత‌మ‌ని ఐసీసీ కొనియాడింది.

    ఆస్ట్రేలియా సిరీస్ లో మూడు టెస్ట్ మ్యాచ్ ల్లో 245 పరుగులు చేశాడు. ఇక వుమెన్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు సౌతాఫ్రికా బౌలర్ షబినమ్ ఇస్మాయిల్ కి దక్కింది. మూడు వన్డేలాడిన ఇస్మాయిల్ ఏడు వికెట్లు తీసింది.






    అంతర్జాతీయ క్రికెట్ (ICC) లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ప్రతినెలా ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఇవ్వాలని ఐసీసీ నిర్ణయించింది. ఏడాది పొడవునా అన్ని ఫార్మాట్లలో మెన్స్‌, విమెన్స్‌ క్రికెటర్ల ఉత్తమ ప్రదర్శనల గుర్తించి క్రికెటర్ల విజయాన్ని సెలబ్రేట్‌ చేసేందుకు ఈ అవార్డులను ఇవ్వనుంది.దీనిలో భాగంగానే ఆరంభ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులకు నామినీలను కూడా ప్రకటించింది. ఇప్పుడు ఈ అవార్డు పంత్ కు దక్కింది.
    Published by:Sridhar Reddy
    First published: