స్లెడ్జింగ్‌ చేసిన రిషబ్ పంత్.. రెచ్చిపోయి వికెట్ పోగొట్టుకున్న ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్

Rishab panth keeping

టీమిండియా వికెట్ రిషబ్ పంత్ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ డోమ్ సిబ్లీని స్లేడ్జింగ్ చేశాడు. అంతకుముందు అక్సర్ వేసిన బంతిని బౌండరీకి తరిలించే ప్రయత్నం చేసి డోమ్ విఫలమయ్యాడు

 • Share this:
  నాలుగో టెస్టులో మొదటి రోజున లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఆక్సర్ పటేల్‌ మరోసారి సత్తా చాటాడు. అతను వేసిన మెుదటి ఓవర్‌లోనే ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్‌ను కూల్చాడు. అయితే ఆక్సర్ రెండో వికెట్ తీసే ముందు మ్యాచ్ నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. టీమిండియా వికెట్ రిషబ్ పంత్ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ డోమ్ సిబ్లీని స్లేడ్జింగ్ చేశాడు. అంతకుముందు అక్సర్ వేసిన బంతిని బౌండరీకి తరిలించే ప్రయత్నం చేసి డోమ్ విఫలమయ్యాడు. దీంతో వికెట్స్ వెనుకలా నుంచి పంత్ "సమ్ వన్ ఈజ్ గెటింగ్ ఆంగ్ర్రీ"(ఎవరో కోపం తెచ్చుకుంటున్నారు) అంటూ డోమ్ సిబ్లీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు. దీంతో రెచ్చిపోయిన డోమ్ తర్వాతి బంతిని సిక్సర్‌గా మలిచే ప్రయత్నం చేశాడు. ఆ బంతి టైమింగ్ కరక్ట్‌గా కుదరక గాల్లో లెచి పిరాజ్ చేతిలో పడింది.  ప్రస్తుతం ఇంగ్లాండ్ 89/4తో నిలకడగా ఆడుతుంది. ఆలీ పోప్ 4, స్టోక్స్‌ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా బౌలర్లలో అక్షర్‌ రెండు.. సిరాజ్‌ రెండు వికెట్లు తీశాడు. అంతకు ముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో ఓటిమి తర్వాత కోలుకొని వరుసగా రెండు మ్యాచ్‌లలో విజయం సాధించిన భారత జట్టు అదే జోరుతో చివరి టెస్ట్ కూడా గెలవాలని చూస్తోంది. మ్యాచ్‌ గెలిచి కనీసం పిరీస్‌కు ‘డ్రా’ అయిన చేయాలని ఇంగ్లండ్‌ భావిస్తోంది. ఇప్పటివరకు 2-1తో భారత్ సిరీస్‌లో ముందంజలో ఉంది.

  భారత జట్టు: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌గిల్‌, చెతేశ్వ పుజారా, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), అజింక్య రహానె, రిషభ్‌పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ సిరాజ్‌

  ఇంగ్లాండ్‌ జట్టు: డొమినిక్‌ సిబ్లీ, జాక్‌ క్రాలే, జానీ బెయిర్‌స్టో, జోరూట్‌ (కెప్టెన్‌), బెన్‌స్టోక్స్‌, ఓలిపోప్‌, బెన్‌ఫోక్స్‌, డానియల్‌ లారెన్స్‌, డొమినిక్‌ బెస్‌, జాక్‌లీచ్‌, జేమ్స్‌ అండర్సన్‌
  Published by:Rekulapally Saichand
  First published: