Home /News /sports /

RISHABH PANT SCORES A CENTURY IN THE THIRD TEST SOUTH AFRICA IN THE TARGET CHASE SNR

రెండో ఇన్నింగ్స్‌లో పంత్ సెంచరీ..111స్కోర్ చేధనలో సౌతాఫ్రికా

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Rishabh Pant: టీమిండియా బ్యాట్స్‌మెన్ రిషభ్‌పంత్ రెచ్చిపోయాడు. థర్డ్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రిక బౌలర్లను రఫ్పాడించాడు. వరుసగా వికెట్లు పడుతున్నా..నిలదొక్కుకొని సెంచరీ పూర్తి చేశాడు. ఆరు సిక్సులు, నాలుగు ఫోర్లతో సఫారీలకు చెమటలు పట్టించాడు.

ఇంకా చదవండి ...
భారత్‌ (india), సౌతాఫ్రిక (South Africa)మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆటగాడు రిషభ్‌పంత్‌ (Rishabh Pant)అద్భుతమైన ఆటను ప్రదర్శించాడు. మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌లో తన సత్తా ఏంటో సౌతాఫ్రికా (South Africa)బౌలర్లకు చూపించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా..నిలకడగా ఆడుతూనే స్కోర్‌ను పరుగులు పెట్టించాడు పంత్‌. తన అద్భుతమైన ఇన్నింగ్స్‌ని ప్రదర్శించి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్లు విఫలమైనప్పటికి కొహ్లీ (virat kohli)పార్టనర్‌షిప్‌తో చెలరేగిపోయాడు పంత్. విరాట్‌ కొహ్లీ ఆట ముగిసే సమయానికి 29పరుగులు చేసి పర్వాలేదని పించుకున్నాడు. ఇవాళ్టి ఆటలో ఆరు సిక్సులు, నాలుగు ఫోర్లతో సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచాడు రిషభ్‌పంత్(Rishabh Pant). ఈ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 223పరుగులు చేయగా, సౌతాఫ్రిక (South Africa)210 పరుగులు సాధించింది. ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో 13పరుగుల ఆధిక్యంలో ఉన్న ఇండియా ఆటగాళ్లు రెండో ఇన్నింగ్స్‌ స్కోరు 198పరుగుల వద్ద ఉండగానే ఆట ముగిసింది. దీంతో భారత్‌ ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని కలుపుకొని సౌతాఫ్రికకు 212 టార్గెట్‌ స్కోర్‌ని నిర్ధేశించింది.

పంత్‌ సూపర్ సెంచరీ..
మూడో రోజు 212 టార్గెట్‌ని చేధించేందుకు బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికన్లు..మొదట్లోనే భారీ స్కోర్ చేసేందుకు ప్రయత్నించి రెండు వికెట్లు నష్టపోయారు. కేవలం 101పరుగులకు ఎల్గర్, మార్ర్కమ్‌ పెవిలిన్ దారి పట్టారు. ప్రస్తుతం పీటర్సన్‌ 48పరుగులతో క్రీజ్‌ల ఉన్నాడు. శుక్రవారం జరిగే ఆటలో భారత్‌ 8వికెట్లు పడగొడితే టీమిండియాకు విజయం వరిస్తుంది. ఇక సఫారీలు కూడా విజయానికి 111పరుగుల దూరంలో ఉన్నారు.

భారం భారత బౌలర్లపైనే ..
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో పంత్‌ మినహా ఏ ఒక్కరు బ్యాటింగ్‌లో దూకుడు ప్రదర్శించలేకపోయారు. దీంతో సౌతాఫ్రికా బౌలర్ల చేతిలో వరుసగా వికెట్లు నష్టపోయారు. భారత్‌ ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్ 10పరుగులు, కోహ్లీ 29స్కోర్‌ చేయగా రిషభ్‌పంత్‌ సెంచరీతో నాటౌట్‌గా నిలిచాడు. మిగిలిన వాళ్లంతా సింగిల్ డిజిట్‌ స్కోరుకే వెనుదిరిగారు. సౌతాఫ్రిక బౌలర్లలో జన్సెన్ 4, రబాడ, ఎంగిడి చెరో మూడు వికెట్లు పడగొట్టారు. శుక్రవారం సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్లు రాణిస్తారో..లేక భారత బౌలర్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారో చూడాలి.
Published by:Siva Nanduri
First published:

Tags: South Africa, Team India, Test Cricket

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు