• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • RISHABH PANT KA KAMAL DELHI CAPITALS CAPTAIN BECAME A MOWER IN QUARANTINE BREAK AND WATCH VIRAL VIDEO SRD

Rishabh Pant : యే దిల్ మాంగే "మూవర్"..రిషబ్ పంత్ కా కమాల్...వైరల్ వీడియో..

Rishabh Pant : యే దిల్ మాంగే "మూవర్"..రిషబ్ పంత్ కా కమాల్...వైరల్ వీడియో..

Rishabh Pant : యే దిల్ మాంగే "మూవర్"..రిషబ్ పంత్ కా కమాల్...వైరల్ వీడియో..

Rishabh Pant : రిషబ్ పంత్ ఏది చేసినా వెరైటీగానే ఉంటుంది. గ్రౌండ్ లోనైనా, బయట ఎక్కడైనా సరే మనోడు చాలా సరదాగా ఉంటాడు. లేటెస్ట్ గా రిషబ్ పంత్ వీడియో ఒకటి వైరలవుతోంది. అదేంటో ఓ లుక్కేయండి.

  • Share this:
    దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. కరోనా మహమ్మారి విజృంభణకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కరోనా ఎఫెక్ట్ చాలా రంగాలపై పడింది. ఐపీఎల్ (IPL2021) పై కూడా క్రిమినల్ కరోనా కన్ను పడటంతో బీసీసీఐ(BCCI) నిరవధిక వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో టోర్నీలో పాల్గొన్న ఆటగాళ్లు అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. ఇంగ్లండ్ టూర్ కు ఎంపికైన టీమిండియా ప్లేయర్లకు బీసీసీఐ కఠిన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన ఆటగాళ్లు ఇళ్లు వదిలి వెళ్లడం లేదు. ఇంట్లోనే ఉంటూ తమ ఫిట్ నెస్ పై దృష్టి సారించారు. అందుబాటులో ఉన్న వాటితోనే కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh Pant).. ఢిల్లీలోని తన ఇంట్లో సరదాగా గడుపుతున్నాడు. కరోనా సెకండ్ వెవ్ కారణంగా బయట పరిస్థితులు బాగా లేకపోవడంతో రిషబ్ పంత్ ఎక్కడికీ వెళ్లడం లేదు. ఇంట్లోనే క్వారంటైన్‌ అయ్యాడు. జిమ్‌లు లేకపోవడం, క్రీడా మైదానాలు మూసేయడంలో ఇంటివద్దే కసరత్తులు చేస్తున్నాడు. ఇంటి వద్ద ఉన్న మైదానంలో గడ్డిని చదును చేసే మూవర్‌ను అటు ఇటూ తిప్పుతూ.. గ్రౌండ్‌ను చక్కదిద్దాడు. మూవర్‌ సాయంతో మైదానం మొత్తాన్ని శుభ్రం చేశాడు. దీంతో అతడికి వ్యాయామం చేసినట్టు కూడా అయింది. ఇందుకు సంబందించిన వీడియోను పంత్‌ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీనికి మనోడు మంచి కాప్షన్ ఇచ్చాడు.

    "యే దిల్‌ మాంగే "మూవర్‌"!. క్వారంటైన్‌కు విరామం ఇవ్వక తప్పలేదు. అయితే ఇండోర్‌లో చురుగ్గా ఉండేందుకు ప్రయత్నించడం సంతోషకరం. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి" అని రిషబ్ పంత్ వీడియోకు రాసుకొచ్చాడు. ఈ వీడియో వైరల్ అయింది. ఇక ఇంగ్లండ్ పర్యటనలో పంత్‌ అత్యంత కీలకం కానున్నాడు. ఒత్తిడి చిత్తు చేస్తున్నా దూకుడుగా బ్యాటింగ్‌ చేయగల అతడి సామర్థ్యం కోహ్లీసేనకు కొండంత బలం. గతంలోనూ అతడు ఇంగ్లండ్ సిరీసులో పరుగుల వరద పారించాడు.


    ఐపీఎల్‌ 14వ సీజన్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌కు శ్రేయాస్‌ అయ్యర్‌ స్థానంలో నాయకత్వం వహించిన రిషబ్ పంత్‌ జట్టును అద్భుతంగా నడిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో టాప్‌ స్థానంలో నిలిచింది. ఇక జూన్‌లో న్యూజిలాండ్‌తో జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ఇప్పటినుంచే సన్నద్ధం అవుతున్నాడు. ఆసీస్‌తో సిరీస్‌ నుంచి భీకరమైన ఫామ్‌లో ఉన్న పంత్‌.. చాంపియన్‌షిప్‌ ఫైనల్‌, ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ అదే కంటిన్యూ చేయాలని అభిమానులు భావిస్తున్నారు. మంచి స్వింగ్ కండీషన్స్ ఉండే ఇంగ్లండ్ గడ్డపై మనోడి సత్తా చాటితే..భవిష్యత్తులో రిషబ్ పంత్ కు డోకా ఉండదు.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు