పంత్‌ను ఒత్తిడి చేయొద్దు...రోహిత్ శర్మ మద్దతు...

పంత్ వయస్సు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే అని అత‌డిపై అన‌వ‌స‌ర ఒత్తిడి తేవ‌డం త‌గ‌ద‌ని రోహిత్ వెనకేసుకొచ్చారు. ఎందుకంటే ప్ర‌తికూల వార్త‌లు వారి ప్ర‌ద‌ర్శ‌న‌ను ప్ర‌భావితం చేస్తాయి.

news18-telugu
Updated: April 7, 2020, 10:39 PM IST
పంత్‌ను ఒత్తిడి చేయొద్దు...రోహిత్ శర్మ మద్దతు...
రోహిత్ శర్మ, రిషబ్ పంత్
  • Share this:
టీమిండియా వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మ‌న్ రిష‌బ్ పంత్‌ అండగా, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచాడు. `యువ ఆట‌గాళ్ల గురించి రాసేముందు మీడియా ఒక‌టికి రెండు సార్లు ఆలోచిస్తే మంచిందని హితవు పలికారు. పంత్ వయస్సు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే అని అత‌డిపై అన‌వ‌స‌ర ఒత్తిడి తేవ‌డం త‌గ‌ద‌ని రోహిత్ వెనకేసుకొచ్చారు. ఎందుకంటే ప్ర‌తికూల వార్త‌లు వారి ప్ర‌ద‌ర్శ‌న‌ను ప్ర‌భావితం చేస్తాయి. అభిమానులు మాత్రం యంగ్‌ప్లేయ‌ర్స్‌ను బాగా స‌పోర్ట్ చేస్తున్నారు. ఇది శుభ‌ప‌రిణామం. అయితే సామాజిక మాధ్య‌మాల్లో ట్రోల్ చేయ‌డానికి ముందు ఒక‌సారి ఆలోచించుకోవాలి. ప్రతి ఆట‌గాడూ దేశం త‌ర‌ఫున అత్యుత్త‌మ ఆట‌తీరు క‌న‌బ‌ర్చాల‌నే కోరుకుంటాడు` అని రోహిత్ అన్నాడు. దీనికి యువరాజ్ కూడా త‌న అంగీకారం తెలిపాడు.

మాజీ ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్‌తో మంగ‌ళ‌వారం జ‌రిపిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పంత్‌ను రోహిత్ వెన‌కేసుకొచ్చాడు.యువ ఆట‌గాళ్ల‌పై ఇది ప్ర‌తికూల ప్ర‌భావం చూపే అవ‌కాశాలున్నాయ‌ని హిట్‌మ్యాన్ అన్నాడు.

 
First published: April 7, 2020, 10:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading