నారీ నారీ నడుమ పంత్... ఇద్దరమ్మాయిలతో...

నారీ నారీ నడుమ పంత్... ఇద్దరమ్మాయిలతో...

సెలబ్రిటీల ప్రేమాయణాలకు ఓ పట్టాన ఫుల్‌స్టాప్‌లు పడవు. టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ కూడా ఇద్దరమ్మాయిల మధ్య ఇరుక్కుపోతున్నాడా?

 • Share this:
  ఎవరినైనా ప్రేమించినంతకాలం బాగానే ఉంటుంది. వన్స్ బ్రేకప్ అయితే మాత్రం భగ్న ప్రేమికుల్లా మారిపోతుంటారు. ఐతే... టీమిండియా యువ క్రికెటర్ రిషప్ పంత్... మొదట బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలాతో రొమాన్స్ చేశాడు. ఆ తర్వాత ఆమె మరీ ఓవర్ చేస్తోందంటూ... దూరం పెట్టాడు. అలా బ్రేకప్ అయ్యాక... మరో అమ్మాయికి దగ్గరయ్యాడు. ఆమె ఇషా నేగీ. వీళ్ల మధ్య ప్రేమాయణం బాగానే సాగుతోంది. ఇది ఎక్కడి దాకా వెళ్లిందంటే... ఆమె లేకపోతే నేను లేను అని పంత్ చెప్పేంతదాకా. ఇటీవలే ఆమెతో దిగిన ఫొటోను ఫ్యాన్స్‌తో పంచుకున్న పంత్... నీతో ఉన్నప్పుడు నన్ను నేను మరింతగా ఇష్టపడతా అనే కామెంట్ పెట్టాడు. అది చూసిన ఫ్యాన్స్... వావ్... పంత్-ఇషా నెగీ జంట సూపర్ అంటూ వాళ్ల లవ్ ఎఫైర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
  View this post on Instagram

  I like me better when I’m with you 🧡🤷🏻‍♂


  A post shared by Rishabh Pant (@rishabpant) on

  అంతా కూల్‌గా ఉంటే ఇప్పుడీ విషయాన్ని మనం చెప్పుకోవాల్సిన అవసరమే వచ్చేది కాదు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్ యాక్టివ్ అయిపోయిన ఊర్వశీ రౌతేలా మళ్లీ పంత్ లైఫ్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇటు ఇషా నేగీని వదిలే ఉద్దేశంతో లేని పంత్... ఊర్వశీని ఎలాగైనా దూరం పెట్టాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే... ఆమె వాట్సాప్ నంబర్‌ని బ్లాక్‌లో పెట్టాడని తెలిసింది. మరి ఊర్వశీ తనను వదిలేస్తుందా... నిను వీడని నీడను నేను... అంటూ వెంటాడుతుందా అన్నది మున్ముందు మనం చూస్తాం. ఇప్పటికైతే... ఈ భూమ్మీద తానే అత్యంత అందగత్తెను అని చెప్పుకుంటూ ఊర్వశీ... తన ఫ్యాన్స్‌కి అందాల విందు చేస్తూ టైమ్ పాస్ చేస్తోంది.


  Published by:Krishna Kumar N
  First published: