Rishabh Pant : టెస్ట్ ర్యాంకింగ్స్ లోనూ దుమ్ము రేపిన గబ్బా టెస్ట్ హీరో పంత్... కెరీర్ లోనే బెస్ట్ ర్యాంక్

Risabh Pant

Rishabh Pant : అంతర్జాతీయ క్రికెట్​ కౌన్సిల్(ఐసీసీ) విడుదల చేసిన తాజా టెస్టు క్రికెట్​ ర్యాంకింగ్స్‌లో గబ్బా టెస్ట్ హీరో రిషభ్ పంత్ సత్తా చాటాడు.

  • Share this:
    అంతర్జాతీయ క్రికెట్​ కౌన్సిల్(ఐసీసీ)  విడుదల చేసిన తాజా టెస్టు క్రికెట్​ ర్యాంకింగ్స్‌లో గబ్బా టెస్ట్ హీరో రిషభ్ పంత్ సత్తా చాటాడు. గబ్బాలో గర్జించిన ఈ టీమిండియా వికెట్ కీపర్ కెరీర్ బెస్ట్ ర్యాంకును అందుకున్నాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో 13 వ స్థానంలో నిలిచాడు రిషబ్. ఇప్పటికే బ్రిస్బేన్ టెస్ట్‌లో స‌రికొత్త రికార్డు సృష్టించాడు. ఈ రికార్డుతో అత‌డు లెజెండ‌రీ వికెట్ కీప‌ర్ ఎమ్మెస్ ధోనీని మించిపోయాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 1000 ప‌రుగుల మైలురాయిని చేరుకున్న ఇండియ‌న్ వికెట్ కీప‌ర్‌గా పంత్ నిలిచాడు. కెరీర్ లో 16వ టెస్ట్ ఆడుతున్న పంత్‌.. త‌న 27వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘ‌న‌త సాధించాడు. అత‌ని కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ 2 సెంచ‌రీలు, 4 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. పంత్ కంటే ముందు ధోనీ 32 ఇన్నింగ్స్‌లో టెస్టుల్లో 1000 ప‌రుగుల మైల్‌స్టోన్‌ను చేరుకున్నాడు. ఆస్ట్రేలియా టూర్‌ను బాగా ఎంజాయ్ చేసిన పంత్‌.. కంగారూ గ‌డ్డ‌పై త‌న ప‌రుగుల ప్ర‌వాహాన్ని కొన‌సాగించాడు. గబ్బా టెస్ట్ లో 89 పరుగులతో అజేయంగా నిలిచి టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు.

    రిషభ్ పంత్ హీరోయిక్స్ తో భారత జట్టు టెస్టు క్రికెట్‌ చరిత్రలో గొప్ప విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియాతో మంగళవారం ముగిసిన చివరి టెస్టులో భారత్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించి 2–1 తేడాతో బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీని గెలుచుకుంది. 328 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 7 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ గా రిషభ్‌ పంత్‌ నిలిచాడు.


    ఇక ఐసీసీ టెస్టు క్రికెట్​ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ స్థానం దిగజారి నాలుగో ర్యాంక్‌కు చేరుకున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అగ్రస్థానాన్ని, ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భారత్‌తో జరిగిన ఆఖరి టెస్ట్‌లో సెంచరీతో రాణించిన ఆసీస్ యువ బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్.. కోహ్లీని వెనక్కు నెట్టి మూడో స్థానాన్ని అందుకున్నాడు.
    Published by:Sridhar Reddy
    First published: