టీ20 మ్యాచ్‌కి ముందే కివీస్‌కి చుక్కలు చూపిస్తున్న రిషభ్ పంత్

నెట్ ప్రాక్టీస్ సందర్భంగా రిషభ్ పంత్ స్విట్చ్-హిట్‌కు ప్రయత్నించాడు. ఈ వీడియోను ట్విట్టర్‌లో బీసీసీఐ షేర్ చేయగా..సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

news18-telugu
Updated: February 5, 2019, 3:39 PM IST
టీ20 మ్యాచ్‌కి ముందే కివీస్‌కి చుక్కలు చూపిస్తున్న రిషభ్ పంత్
నెట్ ప్రాక్టీస్ చేస్తున్న భారత ఆటగాడు రిషభ్ పంత్
news18-telugu
Updated: February 5, 2019, 3:39 PM IST
తొలి టీ20 మ్యాచ్‌కి ముందే న్యూజిలాండ్‌ బౌలర్లకు భారత ఆటగాడు రిషభ్ పంత్ చుక్కలు చూపిస్తున్నాడు. నెట్ ప్రాక్టీస్ సందర్భంగా రిషభ్ పంత్ స్విట్చ్-హిట్‌కు ప్రయత్నించాడు. ఈ వీడియోను ట్విట్టర్‌లో బీసీసీఐ షేర్ చేయగా..సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఇలా స్విట్చ్-హిట్ షాట్స్ ఆడడంలో కెవిన్ పీటర్సన్, డేవిడ్ వార్నర్‌కు మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు పంత్ కూడా నెట్ ప్రాక్టీస్‌లో ఈ స్పెషల్ షాట్ కోసం ట్రై చేయడం సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది.

భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ వెల్లింగ్టన్‌లో బుధవారం జరగనుంది. న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను 4-1 తేడాతో భారత్ కైవసం చేసుకోవడం తెలిసిందే. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను కూడా కైవసం చేసుకుని విదేశీ గడ్డపై మరోసారి తన సత్తా చాటుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. అయితే ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల ఫలితాలను పరిగణలోకి తీసుకుని విశ్లేషిస్తే...సొంతగడ్డపై న్యూజిలాండ్‌దే పైచేయిగా ఉంది. న్యూజిలాండ్‌లో ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 9 టీ20 మ్యాచ్‌లు జరగ్గా...రెండు మ్యాచ్‌లలో మాత్రమే భారత జట్టు విజయం సాధించింది.

Video: ఇలా చూస్తే... కుంభమేళా ఎంత అందంగా ఉందో...?
First published: February 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...