Home /News /sports /

RISHABH PANT ASKS SUGGESTIONS ON TWITTER FOR NEW HOUSE IS WICKETKEEPING BATSMAN MARRIAGE ON THE CARDS SRD

Rishabh Pant : రిషభ్ పంత్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నాడా..? ఆ ట్వీట్ కు అర్ధమేంటి...

Rishabh Pant GF Isha Negi Isha Negi S

Rishabh Pant GF Isha Negi Isha Negi S

Rishabh Pant : ఆస్ట్రేలియా లాంగ్ టూర్ తర్వాత ఇటీవలే భారత్ కు తిరిగొచ్చిన టీమిండియా ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులతో సరాదాగా గడుపుతున్నారు. ఇక ఆస్ట్రేలియా పర్యటన తర్వాత టీమిండియా యంగ్ డైనమైట్ రిషభ్ పంత్ చాలా ఉత్సాహంగా కన్పిస్తున్నాడు. అయితే ఈ యంగ్ క్రికెటర్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయ్.

ఇంకా చదవండి ...
  ఆస్ట్రేలియా లాంగ్ టూర్ తర్వాత ఇటీవలే భారత్ కు తిరిగొచ్చిన టీమిండియా ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులతో సరాదాగా గడుపుతున్నారు. ఇక ఆస్ట్రేలియా పర్యటన తర్వాత టీమిండియా యంగ్ డైనమైట్ రిషభ్ పంత్ చాలా ఉత్సాహంగా కన్పిస్తున్నాడు. బ్రిస్బేన్ లో జరిగిన నాలుగో టెస్ట్ లో సంచలన ఇన్నింగ్స్ తో పంత్ ఒక్కసారిగా హీరో అయిపోయాడు.ఆస్ట్రేలియా పర్యటనలో చిరస్మరణీయ అనుభవాలు సొంతం చేసుకున్న ఈ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ ప్రస్తుతం కుటుంబంతో కలిసి సమయం గడుపుతున్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌కు ఎంపికైన పంత్‌ గురువారం ట్విటర్‌లో అభిమానులతో ముచ్చటించాడు. తాను ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నానని, ఇందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరాడు. " ఆస్ట్రేలియా నుంచి వచ్చినప్పటి నుంచి కొత్త ఇల్లు కొనమని ఇంట్లో వాళ్లు నా వెంటపడుతున్నారు. గురుగ్రాం బాగుంటుందా? లేదంటే వేరే ఆప్షన్లు ఏమైనా ఉన్నాయా " అని పంత్‌ ట్వీట్‌ చేశాడు. అయితే పంత్ ఇల్లు కొనుక్కొనే ప్రయత్నం పెళ్లి కోసమేనా అనే టాక్ విన్పిస్తోంది. ఇంటీరియర్‌ డిజైనర్‌ ఇషా నేగితో మనోడు ప్రేమాయణంలో ఉన్నాడు. త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి పీటలెక్కనున్నారనే గుసగుసలు విన్పిస్తున్నాయ్.

  ఇటీవలే మంచుకొండల్లో దిగిన ఫొటోలను న్యూ ఇయర్‌ సందర్భంగా పోస్ట్‌ చేసిన పంత్‌..‘నీతో ఉండడాన్ని ఎక్కువగా ఇష్టపడతా’ అని రాయడం ద్వారా ఆమెతో తన ప్రేమను బహిరంగపరిచాడు. బ్రిస్బేన్‌ టెస్ట్‌లో పంత్‌ హీరోచిత ఇన్నింగ్స్‌తో ప్రస్తుతం నెటిజన్ల దృష్టి పంత్‌-నేగిపై జోడీపై మరింత పడింది. అయితే పంత్ చేసిన ట్వీట్ తో ఇక నెటిజన్ల నుంచి ఇందుకు మిశ్రమ స్పందన లభిస్తోంది. " కోల్‌కతాకు దగ్గరల్లో ఇల్లు కొనుక్కో.. ఐపీఎల్‌ ఆడటం ఈజీ అవుతుంది.. ఇదిగో నీ ముఖం సరిగ్గా ఇప్పుడు ఇలాగే ఉంటుంది కదా" అని కొంతమంది సరదాగా కామెంట్‌ చేశారు. మరి కొందరు " ఆస్ట్రేలియా పౌరసత్వం, ఆధార్‌ కార్డు తీసుకుని సిడ్నీలో సెటిల్‌ అయిపో " అంటూ మూడో టెస్టు జ్ఞాప​కాలు గుర్తుచేస్తున్నారు. ఇక​ ఇంకొంత మంది మాత్రం..." నేను కచ్చితంగా చెప్పగలను. ఇలాంటి ప్రశ్న అడిగేందుకు కోహ్లి, రోహిత్‌కు కూడా గట్స్‌ ఉండవు అంటే నమ్మండి " అని వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.
  ఆస్ట్రేలియా టూర్ లో అద్భుత‌మైన బ్యాటింగ్‌తో ఆక‌ట్టుకున్న పంత్‌.. ఐసీసీ రిలీజ్ చేసిన టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానానికి ఎగ‌బాకాడు. అతని కెరీర్ లో ఇదే బెస్ట్ ర్యాంక్. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్ ఆడేందుకు సిద్దమవుతున్నాడు. సిడ్నీ టెస్టులో రిషభ్‌ పంత్‌ 97 పరుగులతో అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. తృటిలో సెంచరీ చేజార్చుకున్నా.. ఒత్తిడి అధిగమించి జట్టు మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు. అదే విధంగా నాలుగో టెస్టులో 89 పరుగులతో అజేయంగా నిలిచి, అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియాకు అద్భుత విజయాన్ని కట్టబెట్టాడు.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Love marriage, Rishabh Pant, Twitter

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు