RISHABH PANT ASKS SUGGESTIONS ON TWITTER FOR NEW HOME AND FANS SUGGESTED WITH HILARIOUS REPLIES SRD
Rishabh Pant : కొత్త ఇల్లు ఎక్కడ కొనాలో కొంచెం చెప్పరు ప్లీజ్ .. అంటున్న యంగ్ క్రికెటర్
Risabh Pant
Rishabh Pant : ఆస్ట్రేలియా లాంగ్ టూర్ తర్వాత ఇటీవలే భారత్ కు తిరిగొచ్చిన టీమిండియా ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులతో సరాదాగా గడుపుతున్నారు. ఇక ఆస్ట్రేలియా పర్యటన తర్వాత టీమిండియా యంగ్ డైనమైట్ రిషభ్ పంత్ చాలా ఉత్సాహంగా కన్పిస్తున్నాడు. బ్రిస్బేన్ లో జరిగిన నాలుగో టెస్ట్ లో సంచలన ఇన్నింగ్స్ తో పంత్ ఒక్కసారిగా హీరో అయిపోయాడు.
ఆస్ట్రేలియా లాంగ్ టూర్ తర్వాత ఇటీవలే భారత్ కు తిరిగొచ్చిన టీమిండియా ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులతో సరాదాగా గడుపుతున్నారు. ఇక ఆస్ట్రేలియా పర్యటన తర్వాత టీమిండియా యంగ్ డైనమైట్ రిషభ్ పంత్ చాలా ఉత్సాహంగా కన్పిస్తున్నాడు. బ్రిస్బేన్ లో జరిగిన నాలుగో టెస్ట్ లో సంచలన ఇన్నింగ్స్ తో పంత్ ఒక్కసారిగా హీరో అయిపోయాడు. గబ్బా మైదానంలో 32 ఏళ్ల పాటు ఓటమిని ఎరుగని ఆసీస్ జైత్రయాత్రకు చెక్ పెట్టడంలో కీ రోల్ ప్లే చేశాడు. పంత్ భారత్‌కు తిరిగి రాగానే అభిమానుల నుంచి ఘనస్వాగతం కూడా లభించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనలో చిరస్మరణీయ అనుభవాలు సొంతం చేసుకున్న ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి సమయం గడుపుతున్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌కు ఎంపికైన పంత్ గురువారం ట్విటర్లో అభిమానులతో ముచ్చటించాడు. తాను ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నానని, ఇందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరాడు. " ఆస్ట్రేలియా నుంచి వచ్చినప్పటి నుంచి కొత్త ఇల్లు కొనమని ఇంట్లో వాళ్లు నా వెంటపడుతున్నారు. గురుగ్రాం బాగుంటుందా? లేదంటే వేరే ఆప్షన్లు ఏమైనా ఉన్నాయా " అని పంత్ ట్వీట్ చేశాడు.
అయితే పంత్ చేసిన ట్వీట్ తో ఇక నెటిజన్ల నుంచి ఇందుకు మిశ్రమ స్పందన లభిస్తోంది. " కోల్‌కతాకు దగ్గరల్లో ఇల్లు కొనుక్కో.. ఐపీఎల్ ఆడటం ఈజీ అవుతుంది.. ఇదిగో నీ ముఖం సరిగ్గా ఇప్పుడు ఇలాగే ఉంటుంది కదా" అని కొంతమంది సరదాగా కామెంట్ చేశారు. మరి కొందరు " ఆస్ట్రేలియా పౌరసత్వం, ఆధార్ కార్డు తీసుకుని సిడ్నీలో సెటిల్ అయిపో " అంటూ మూడో టెస్టు జ్ఞాపకాలు గుర్తుచేస్తున్నారు. ఇక ఇంకొంత మంది మాత్రం..." నేను కచ్చితంగా చెప్పగలను. ఇలాంటి ప్రశ్న అడిగేందుకు కోహ్లి, రోహిత్‌కు కూడా గట్స్ ఉండవు అంటే నమ్మండి " అని వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.
Jabse Australia se aaya hoon gharwale peeche pade hain ki naya ghar le lo ab. Gurgaon sahi rahega? Aur koi option hai toh batao.
ఆస్ట్రేలియా టూర్ లో అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న పంత్.. ఐసీసీ రిలీజ్ చేసిన టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానానికి ఎగబాకాడు. అతని కెరీర్ లో ఇదే బెస్ట్ ర్యాంక్. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్ ఆడేందుకు సిద్దమవుతున్నాడు. సిడ్నీ టెస్టులో రిషభ్ పంత్ 97 పరుగులతో అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. తృటిలో సెంచరీ చేజార్చుకున్నా.. ఒత్తిడి అధిగమించి జట్టు మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు. అదే విధంగా నాలుగో టెస్టులో 89 పరుగులతో అజేయంగా నిలిచి, అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియాకు అద్భుత విజయాన్ని కట్టబెట్టాడు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.