IPL 2021: దినేశ్ కార్తీక్‌ను బ్యాటుతో కొట్టబోయిన రిషబ్ పంత్.. తృటిలో తప్పించుకున్న డీకే.. అసలేం జరిగింది?

దినేశ్ కార్తీక్‌ను బ్యాటుతో కొట్టబోయిన రిషబ్ పంత్.. అసలేం జరిగింది? (PC: BCCI Video Grab)

IPL 2021: కోల్‌కతా నైట్‌రైడర్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మంగళవారం షార్జాలో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కీపర్ దినేశ్ కార్తీక్‌ను అనుకోకుండా బ్యాటులో కొట్టబోయాడు.

  • Share this:
    ఐపీఎల్ 2021లో (IPL 2021) భాగంగా ఇవాళ షార్జాలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో (Delhi Capitals) జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌లో తలపడింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ తక్కువ స్కోరుకే పరిమితం అయ్యింది. ఢిల్లీ బ్యాటర్లు అందరూ చేతులెత్తేసిన వేళ కెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) ఒక్కడే క్రీజులో నిలబడి ఒంటరి పోరాటం చేశారు. కానీ తన సహజ శైలికి భిన్నంగా చాలా నెమ్మదిగా ఆడాడు. రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకున్నది. వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేశాడు. ఆ సమయంలో రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్నాడు. వరుణ్ వేసిన బంతి రిషబ్ పంత్ కొట్టగా అది అక్కడే గాల్లోకి లేచి వికెట్ల వైపు పడబోయింది. దీంతో పంత్ దాన్ని బ్యాటుతో అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఆ బంతిని పట్టుకోవడానికి దగ్గరకు వచ్చిన వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) తృటిలో పంత్ బ్యాటు నుంచి తప్పించుకున్నాడు.

    అప్పటికే వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఢిల్లీ పంత్ వికెట్ కూడా కోల్పోతే మరింత కష్టాల్లో పడేది. అందుకే తన వికెట్ కోల్పోకూడదనే ఉద్దేశంతో బ్యాటును బలంగా ఊపాడు. అయితే వెంటనే గమనించిన దినేశ్ కార్తీక్ తప్పించుకున్నాడు. లేకపోతే దినేశ్‌కు గట్టిగా తగిలేదు. ఆ తర్వాత దినేశ్, పంత్ ఇద్దరు నవ్వుకొని కాసేపు మాట్లాడుకున్నారు. బీసీసీఐ ఈ వీడియోను ఐపీఎల్ పేజీలో అప్‌లోడ్ చేయగా వైరల్‌గా మారింది. అంతే కాకుండా ఈ వీడియోను చాలా మంది షేర్లు కూడా చేస్తున్నారు.

    IPL 2021: హోటల్ గదిలోనే డేవిడ్ వార్నర్.. గ్రౌండ్‌కు ఎందుకు రాలేదని ఫ్యాన్స్ అయోమయం.. క్లారిటీ ఇచ్చిన కోచ్









    మరోవైపు ఇదే మ్యాచ్‌లో అశ్విన్, టిమ్ సౌథీ మధ్య కూడా వాగ్వాదం జరిగింది. టిమ్ సౌథీ బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టి అశ్విన్ క్యాచ్అవుట్ అయ్యాడు. ఆ సమయంలో ఇద్దరూ చూసుకోకుండా ఢీకొన్నారు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో రిషబ్ పంత్ కూడా వెళ్లి కాస్త దూకుడుగా వ్యవహరించాడు. అయితే వీరిద్దరినీ దినేశ్ కార్తీక్ పక్కకు తీసుకొని వెళ్లాడు. మొత్తానికి ఈ రోజు ఢిల్లీ-కోల్‌కతా మధ్య మ్యాచ్ చాలా హట్ హాట్ గా జరిగింది.
    Published by:John Naveen Kora
    First published: