రోహిత్ రిక్వెస్ట్‌ను తిరస్కరించిన రిషభ్...రీజన్ అదే

ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్ట్ సిరీస్‌తో రిషభ్ పంత్ ఒక్కసారిగా హీరో అవ్వడం మాత్రమే కాదు మంచి బేబి సిట్టర్‌ అనిపించుకున్నాడు. మా పాపకు బేబి సిట్టింగ్ చేస్తావా..?? అని రిషభ్‌ను రోహిత్ శర్మ కోరాడు.

news18-telugu
Updated: January 10, 2019, 12:48 PM IST
రోహిత్ రిక్వెస్ట్‌ను తిరస్కరించిన రిషభ్...రీజన్ అదే
రిషభ్ పంత్, రోహిత్ శర్మ ( BCCI/ Twitter )
news18-telugu
Updated: January 10, 2019, 12:48 PM IST
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ రిక్వెస్ట్‌ను రిషభ్ పంత్ తిరస్కరించాడు. ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్ట్ సిరీస్‌తో ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారిన రిషభ్.. సిడ్నీ టెస్ట్ ముగిసిన తర్వాతి రోజు తన ట్విట్టర్‌లో ఓ ఫోటో పోస్ట్ చేశాడు."గుడ్ మార్నింగ్" అని అభిమానులను పలకరించాడు. రిషభ్‌ను, మా పాపకు బేబి సిట్టింగ్ చేస్తావా..?? అని రిక్వెస్ట్ చేస్తూ ఆ పోస్ట్‌ కింద రోహిత్ కామెంట్ చేశాడు. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌లో రిషభ్ పంత్, ఆస్ట్రేలియా సారధి టిమ్ పెయిన్‌ల మధ్య జరిగిన మాటల యుద్దం బాగా పాపులర్ అయింది. సోషల్ మీడియాలోనూ రిషభ్-టిమ్ పెయిన్‌ల "బేబి సిట్టింగ్" ఎపిసోడ్ వైరల్ అయింది.

ఏకంగా ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్‌ సైతం రిషభ్‌‌ను గుర్తు పెట్టుకున్నారంటే...ఆ ఎపిసోడ్ ఎంతలా పాపులర్ అయిందో అర్థం చేసుకోవచ్చు. పెయిన్ సతీమణి బోనీ పెయిన్‌‌తో కలిసి వారి పిల్లలను ఎత్తుకుని ఓ ఫోటో దిగాడు. ఆ ఫోటోను బోనీ పెయిన్ " బెస్ట్ బేబిసిట్టర్" అని తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో పోస్ట్ చేసింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో రిషభ్ మంచి బేబి సిట్టర్ అని అభిమానులు సైతం సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అందుకే రోహిత్ కూడా తన చంటి పాపను చూసుకోవాల్సిందిగా కోరాడు. "నువ్వో మంచి బేబి సిట్టర్‌వి అని విన్నాను. ప్రస్తుతం మాకు నీలాంటి వారి అవసరముంది. రితికా చాలా సంతోషిస్తుంది..." అని కామెంట్ చేశాడు.

అయితే పంత్ మాత్రం తనదైన స్టైల్‌లోనే బదులిచ్చాడు. యజ్వేంద్ర చహాల్‌ తన పని తాను సమర్ధవంతంగా చేయట్లేదని... మీ పాప సమైరాను చూసుకోవడానికి అతడైతేనే కరెక్ట్ అని...రిప్లై ఇచ్చాడు.
Loading...ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్ట్ సిరీస్‌తో రిషభ్ పంత్ ఒక్కసారిగా హీరో అవ్వడం మాత్రమే కాదు మంచి బేబి సిట్టర్‌ అనిపించుకున్నాడు. అదే సిరీస్‌లో సెన్సేషనల్ సెంచరీతో రికార్డ్స్‌ బద్దలు కొట్టడం మాత్రమే కాదు...టీమిండియా టెస్ట్ జట్టులో చోటు ఖాయం చేసుకున్నాడు.
First published: January 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...