• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • RISHAB PANT DOWN WITH LOSS KOHLI AND SIRAJ CONSOLED HIM JNK

IPL 2021 : మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న పంత్.. అతడిని ఎవరు ఓదార్చారో తెలుసా?

IPL 2021 : మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న పంత్.. అతడిని ఎవరు ఓదార్చారో తెలుసా?

హిట్‌మెయర్‌ను ఓదారుస్తున్న కోహ్లీ, మ్యాక్స్‌వెల్

  • Share this:
    ఐపీఎల్ 2021లో (IPL 2021) మంచి విజయాలు సాధిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals).. మంగళవారం రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరుతో (Royal Challengers Bengaluru) అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. కెప్టెన్ రిషబ్ పంత్ (58) (Rishabh Pant) చివరి వరకు క్రీజ్‌లో ఉన్నా జట్టును గెలిపించలేకపోయాడు. మహ్మద్ సిరాజ్ వేసిన ఆఖరి ఓవర్లో తొలి మూడు బంతులకు భారీ షాట్లు కొట్టలేక పోవడమే ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయానికి కారణమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మ్యాచ్ ఓడిపోయిన అనంతరం పంత్ తీవ్రంగా ఆవేదన చెండాడు. ముందుగా యజువేంద్ర చాహల్ అతడి వద్దకు వెళ్లి ఓదార్చాడు. పంత్ ఎవరినీ పట్టించుకోకుండా తనలో తానే బాధపడుతూ ఎదుటి టీమ్‌కు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ వెళ్లిపోయాడు. అయితే మహ్మద్ సిరాజ్, కెప్టెన్ విరాట్ కోహ్లీ అతడి వద్దకు వచ్చి ఓదార్చారు. ఒక్క అపజయంతో డీలా పడిపోవద్దని.. ఢిల్లీ మంచి పోరాటం చేసిందని కోహ్లీ చెప్పాడు. పంత్ ఆందోళన చెంది ఫామ్ కోల్పోతే అది టీమ్ ఇండియాకే భారంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే కోహ్లీ మ్యాచ్ అనంతరం చాలా సేపు పంత్‌తో మాట్లాడుతూ కనిపించాడు.

    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 171 పరుగులు చేసింది. రజత్ పటిదార్ సహా ఏబీ డివిలియర్స్ రాణించడంతో డిఫెండబుల్ స్కోర్ సాధించింది. ముఖ్యంగా ఏబీ డివిలియర్స్ కేవలం 42 బంతుల్లో 75 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో 23 పరుగులు రావడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఊపిరి పీల్చుకుంది. లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ త్వరగానే మూడు వికెట్లు కోల్పోయింది. రిషబ్ పంత్ (58), మార్కస్ స్టొయినిస్ (22), షిమ్రోన్ హిట్‌మెయర్ (53) రాణించడంతో ఢిల్లీ లక్ష్యానికి చేరువలోకి వచ్చింది. అయితే చివరి ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్ మ్యాజిక్ చేశాడు. యార్కర్లు వేస్తూ బౌండరీలు రాకుండా కాపాడాడు. చివరి రెండు బంతులకు 10 పరుగులు చేయాల్సి ఉండగా.. రిషబ్ పంత్ వరుసగా రెండు బౌండరీలు కొట్టాడు. దీంతో ఒక పరుగు తేడాతో ఢిల్లీ ఓడిపోయింది. చివరి వరకు కష్టపడినా మ్యాచ్ గెలిపించలేక పోయినందుకు పంత్ డీలా పడ్డాడు.



    మ్యాచ్ ముగిసి ఇరు జట్లు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన తర్వాత పంత్, కోహ్లీ, చాహల్ చాలా సేపు మాట్లాడుకోవడం కనిపించింది. భారత జట్టులో రెగ్యులర్ సభ్యులైన వీళ్లు తరచుగా డ్రెస్సింగ్ రూమ్‌లో కలుసుకుంటూనే ఉంటారు. అయితే ఐపీఎల్ కారణంగా ఒక్కొక్కరు ఒక్కో జట్టులో ఉన్నారు. పంత్ ఈ ఏడాదే కొత్తగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. దీంతో కోహ్లీ అతడిని ఓదార్చి.. మ్యాచ్ ఓడినా పోరాటం బాగుందని చెప్పినట్లు తెలుస్తున్నది. అంతే కాకుండా ఒక కెప్టెన్‌గా జట్టు కుంగిపోకుండా చూడాల్సిన  బాద్యత ఉందని పంత్ ‌కు కోహ్లీ వివరించాడు.
    Published by:John Naveen Kora
    First published: