ఐపీఎల్ 2021 (IPL 2021) ఆరంభంలోనే పలువురు ఆటగాళ్లు కరోనా (Covid 19) బారిన పడ్డారు. తొలి విడత మ్యాచ్‌ల కోసం ఆయా జట్లు ముంబై, చెన్నైలో ఉండగానే క్రికెటర్లతో పాటు గ్రౌండ్స్‌మెన్, బ్రాడ్‌కాస్టింగ్ సిబ్బంది కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యారు. ఈ క్రమంలో ఆటగాళ్లను క్వారంటైన్ చేయగా.. మిగిలిన వారిని ఇళ్లకు పంపించేసి అక్కడే ఐసోలేషన్ చేయమని ఐపీఎల్ యాజమాన్యం ఆదేశించింది. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ (Devdutt Padikkal) విషయంలో ఆ జట్టు యాజమాన్యం బీసీసీఐ (BCCI)నిర్దేశించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఫాలో కాలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి పడిక్కల్‌కు మార్చి 22న కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ సమయంలో అతడు ఇంట్లోనే క్వారంటైన్ అయ్యాడు. కరోనా నుంచి కోలుకున్నట్లు భావించిన అతడు బెంగళూరు నుంచి చెన్నై వరకు స్వయంగా కారులో వచ్చాడు. అక్కడే రెండు కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. ఆ సమయంలో అతడికి నెగెటివ్ రిజల్ట్ వచ్చింది. దీంతో అతడిని నేరుగా ఆర్సీబీ జట్టు ఉంటున్న బయోబబుల్‌లోకి అనుమతించారు. ఇప్పుడు ఇదే పెద్ద వివాదాస్పదంగా మారింది.
బీసీసీఐ నిబంధనల ప్రకారం ఎవరైనా ఆటగాడు పాజిటివ్ నుంచి నెగెటివ్ వచ్చినా.. ఏడు రోజుల పాటు క్వారంటైన్లో ఉన్న తర్వాత మాత్రమే బయోబబుల్‌లోకి అడుగుపెట్టాల్సి ఉంటుంది. ప్రతీ ఫ్రాంచైజీకి ఈ నిబంధనలను బీసీసీఐ ముందుగానే తెలిపింది. ఆర్సీబీ యాజమాన్యానికి ఈ నిబంధనలు తెలిసినా పడిక్కల్‌ను నేరుగా బయోబబుల్‌లోకి అనుమతించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా పాజిటివ్ వచ్చిన ఆటగాడు నెగెటివ్ వచ్చిన తర్వాత క్వారంటైన్లోకి వెళ్లి తిరిగి రెండు సార్లు నెగెటివ్ వస్తేనే జట్టుతో కలవడానికి అనుమతించాలి. పడిక్కల్ విషయంలో ఈ నిబంధనలు ఏవీ పాటించలేదని తెలుస్తున్నది. దీనిపై మిగతా ఫ్రాంచైజీలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. బయోబబుల్ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల మిగతా క్రికెటర్లకు, సిబ్బందికి కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.
— Royal Challengers Bangalore (@RCBTweets) April 10, 2021
కాగా, గత సీజన్లో ఆర్సీబీ తరపున ఓపెనర్‌గా వచ్చిన పడిక్కల్ బెంగళూరు తరపున 15 మ్యాచ్‌లు ఆడాడు. 31.53 సగటుతో మొత్తం 473 పరుగులు చేశాడు. ఆర్సీబీ తరపున విశేషంగా రాణించిన పడిక్కల్ గత సీజన్లో అత్యధిక స్కోర్ 74. ఆర్సీబీ యాజమాన్యం యువక్రికెటర్లకు శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా కెప్టెన్ విరాట్ కోహ్లీని పడిక్కల్‌కు గురువుగా నియమించింది. ఆ సమయంలో రాటు దేలిన పటిక్కల్ బెంగళూరు తరపున పలు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఏడాది అక్షర్ పటేల్, నితీష్ రాణా తర్వాత కరోనాగా తేలింది పడిక్కల్ మాత్రమే. ఆర్సీబీలోని డేనియల్ సామ్స్ కూడా కరోనా పాజిటివ్ రావడంతో ప్రస్తుతం చెన్నైలోని ఒక హోటల్లో ఐసోలేషన్‌లో ఉన్నాడు.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.