ప్రపంచ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు టీమిండియాలో లుకలుకలు బయటపడుతున్నాయి. భారతజట్టులో సభ్యుల ఎంపిక మీద పక్షపాత ధోరణి అవలంభిస్తున్నారనే వాదన తెరపైకి వచ్చింది. జట్టులో కెప్టెన్ కోహ్లీకి అనుకూలంగా ఉండే వారికే తుదిజట్టులో స్థానం దక్కుతోందంటూ డ్రెసింగ్ రూమ్ నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. కుల్‌దీప్ కంటే కోహ్లీ.. చాహల్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడని ఆరోపిస్తున్నారు. మరోవైపు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు మరికొందరు మద్దతుగా ఉంటున్నారని చెబుతున్నారు. తుదిజట్టు ఎంపికలో పక్షపాత ధోరణి వల్ల టీమిండియా నష్టపోతుందని వాదిస్తున్నారు.
వరల్డ్ కప్ హాట్ ఫేవరెట్లలో భారత్ కూడా ఒకటి. లీగ్ దశలో అత్యధిక విజయాలతో టాప్‌లో నిలిచిన విరాట్ కోహ్లీ సేన.. నాకౌట్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. అయితే, అందులో అంపైర్ తప్పుడు నిర్ణయంతో పాటు, ధోనీని ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం మీద కూడా విమర్శలు వచ్చాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, ICC Cricket World Cup 2019, Rohit sharma, Team India, Virat kohli