Home /News /sports /

RIFT BETWEEN KOHLI AND ROHIT BCCI WANTS TO SIT WITH TWO CAPTAINS AFTER SOUTH AFRICA TOUR JNK

Team India: టీమ్ ఇండియాలో కెప్టెన్ల రగడ.. కోహ్లీ-రోహిత్ మధ్య భగ్గుమన్న విభేదాలు.. రంగంలోకి దిగిన బీసీసీఐ

కోహ్లీ - రోహిత్ మధ్య గొడవలు తీరేది ఎన్నడు?

కోహ్లీ - రోహిత్ మధ్య గొడవలు తీరేది ఎన్నడు?

Team India: టీమ్ ఇండియాలో ఇద్దరు కెప్టెన్ల మధ్య మాటామంతీ లేకపోవడం బీసీసీఐని ఆందోళనకు గురి చేస్తున్నది.కీలకమైన దక్షిణాఫ్రికా పర్యటన సమయంలో కోహ్లీ - రోహిత్ శర్మ మధ్య విభేదాలు భగ్గుమనడంతో టీమ్ ఇండియా ఆందోళనలో ఉన్నది.

  టీమ్ ఇండియాలో (Team India) వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను పెట్టిన తర్వాత సరికొత్త సమస్య మొదలైంది. ఇప్పటి వరకు బీసీసీఐ (BCCI) ఏనాడూ ఎదుర్కొనని కెప్టెన్ల రగడ టీమ్ ఇండియాను ఆందోళనకు గురి చేస్తున్నది. విరాట్ కోహ్లీని (Virat Kohli) వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంతో మొదలైన ఈ గొడవ రోజు రోజుకూ పెరుగుతుందే తప్ప.. తగ్గే మార్గమే కనపడటం లేదు. కీలకమైన దక్షిణాఫ్రికా పర్యటనకు (South Africa Tour) ముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల (Rohit Sharma) మధ్య ఉన్న విభేదాలు బయటపడటంతో బీసీసీఐ పెద్దలతో పాటు టీమ్ మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిలా మారిపోయింది. ఇన్నాళ్లూ డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం అయిన సీనియర్ క్రికెటర్ల విభేదాలు ఇప్పుడు రచ్చెకెక్కాయి. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ అసలు ఒకరి మొఖం ఒకరు చూసుకోవడానికే ఇష్టపడటం లేదు. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సిన భారత జట్టు జట్టు ఆదివారమే ముంబైకి చేరుకున్నది. సోమవారం మధ్యాహ్నానికి జట్టు సభ్యులతో పాటు సపోర్టింగ్ స్టాఫ్ కూడా చేరుకున్నది. కానీ విరాట్ కోహ్లీ మాత్రం అందుబాటులో లేకుండా పోయాడు. గాయం కారణంగా రోహిత్ శర్మ టెస్టు సిరీస్‌కి దూరమైనట్లు బీసీసీఐ సోమవారం సాయంత్రం ప్రకటించింది. అప్పుడు గాని కోహ్లీ తాను మంగళవారం జట్టుతో కలుస్తానని సమాచారం పంపాడు. అంతే కాకుండా మరో షాకింగ్ న్యూస్ కూడా చెప్పాడు.

  భారత టెస్టు జట్టు ప్రస్తుతం ముంబైలోని ఒక హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్నది. మరో రెండు రోజుల్లో ప్రత్యేక విమానంలో జొహన్నెస్‌బర్గ్‌కు ప్రయాణం కావల్సి ఉండగా విరాట్ కోహ్లీ జట్టుతో చేరకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. అయితే సోమవారం సాయంత్రం బీసీసీఐ అధికారులకు కాల్ చేసిన విరాట్.. త్వరలోనే జట్టుతో కలసుస్తానని చెప్పాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో మాత్రం పాల్గొనలేనని తేల్చి చెప్పాడు. దీంతో బీసీసీఐ అధికారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. విరాట్ కోహ్లీ నుంచి వన్డే కెప్టెన్సీని తప్పించిన తర్వాత రోహిత్ శర్మను కలవలేదు. అసలు టీ20 వరల్డ్ కప్ తర్వాత ఈ ఇద్దరు సీనియర్ క్రికెటర్లు కలిసే చాన్స్ రాలేదు.

  Virat Kohli: వన్డేలకు కోహ్లీ దూరం అయితే ఎవరిని తీసుకోవాలి? అలా చేస్తే టీమ్ ఇండియాకు కూడా తిరుగు ఉండదు


  న్యూజీలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కోహ్లీ ఆడలేదు. ఇక టెస్టు సిరీస్‌కు రోహిత్ దూరమయ్యాడు. తాజాగా రోహిత్ టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడని తెలిసిన తర్వాతే విరాట్ జట్టుతో కలవడానికి సిద్దపడ్డాడు. మరోవైపు వన్డే సిరీస్‌లో జట్టుకు రోహిత్ కెప్టెన్‌గా వస్తాడు. కానీ, వ్యక్తిగత కారణాలతో ఆ సిరీస్ ఆడలేనని కోహ్లీ చెబుతున్నాడు. ఇలా ఇద్దరూ ఎడమొఖం పెడమొఖంలా ఉండటంతో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థిి నెలకొన్నది. ఇన్నాళ్లూ జట్టుగా కలసి ఉండి.. కెప్టెన్లు మారిపోవడంతో జట్టులోని లుకలుకలు బయటపడటం బీసీసీఐని కూడా కలవరపెడుతున్నది.

  VVS Laxman: ఫ్యామిలీతో సహా బెంగళూరు షిఫ్ట్ అయిన వీవీఎస్ లక్ష్మణ్.. ఇకపై నో కామెంట్రీ.. నో సన్‌రైజర్స్ మెంటార్షిప్
  కుమార్తె వామిక మొదటి బర్త్ డే ఉన్నందువల్ల కుటుంబంతో గడపాలని..అందుకే వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండనని బీసీసీఐ అధికారులకు కోహ్లీ సమాచారం పంపాడు. వాస్తవానికి వామిక పుట్టిన జనవరి 11న దక్షిణాఫ్రికాతో టీమ్ ఇండియా మూడో టెస్టు ప్రారంభం అవుతుంది. కేప్‌టౌన్‌లోజరిగే ఈ మ్యాచ్ కోహ్లీ కెరీర్‌లో 100వ టెస్టు. అప్పుడు కుటుంబానికి దూరంగా ఉండే కోహ్లీ.. అనూహ్యంగా వామిక పుట్టిన రోజు పేరుతో వన్డే సిరీస్‌కు దూరం కావడం పలు అనుమానాలకు తావిస్తున్నది.

  Virat Kohli: అలక మానని విరాట్ కోహ్లీ.. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరం? రాకపోవడానికి కారణం చెప్పిన కోహ్లీ
  'కోహ్లీ వ్యక్తిగత కారణాలు అని చెబుతున్నాడు. కానీ అవి నమ్మశక్యంగా లేవు. ఇప్పడు టీమ్ ఇండియాలో జరుగుతున్న పరిణామాలు ఎవరూ అంగీకరించబోరు. బీసీసీఐ కూడా విరాట్ కోహ్లీ వన్డేలు ఆడకపోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నది. ఇద్దరు కెప్టెన్లను దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత కూర్చోబెట్టి మాట్లాడాలని భావిస్తున్నాము' అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.

  IND vs SA: రోహిత్ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన ప్రియాంక్ పాంచల్ ఎవరు? అతడిని ఎంపిక చేయడం వెనుక కారణాలు ఏంటి?
  విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య సరైన సంబంధాలు లేవని గతంలోనే మీడియా పలు మార్లు కథనాలు వెల్లడించింది. జట్టు యాజమాన్యం గానీ ఇద్దరు కెప్టెన్లు గానీ ఎప్పుడూ ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. కానీ వన్డే కెప్టెన్సీ వివాదం తర్వాత ఇద్దరి మధ్య ఉన్న లుకలుకలు బయటపడుతున్నాయి. ఈ విషయం మరింత పెద్దగా మారి జట్టుపై ప్రభావం చూపకముందే.. సమస్యకు పరిష్కారం చూపాలని బీసీసీఐ భావిస్తున్నది.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:John Kora
  First published:

  Tags: Bcci, Cricket, India vs South Africa, Rohit sharma, Virat kohli

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు