హోమ్ /వార్తలు /క్రీడలు /

Ricky Ponting : కామెంట్రీ చెబుతూ కుప్పకూలిన ఆసీస్ దిగ్గజం.. రికీ పాంటింగ్ కు హార్ట్ ఎటాక్..!

Ricky Ponting : కామెంట్రీ చెబుతూ కుప్పకూలిన ఆసీస్ దిగ్గజం.. రికీ పాంటింగ్ కు హార్ట్ ఎటాక్..!

ఫైల్ ఫోటో

ఫైల్ ఫోటో

Ricky Ponting : ఆస్ట్రేలియా లెజెండరీ ప్లేయర్ .. మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (Ricky Ponting) తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ పాంటింగ్ గుండె పోటుతో ఆస్పత్రిలో చేరాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఆస్ట్రేలియా లెజెండరీ ప్లేయర్ .. మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (Ricky Ponting) తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ పాంటింగ్ గుండె పోటుతో ఆస్పత్రిలో చేరాడు. ఆస్ట్రేలియా - వెస్టిండీస్ (Australia vs West Indies) ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ కు పాంటింగ్ ఛానెల్ 7 కు కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నాడు. మూడో రోజు ఆటలో భాగంగా కామెంట్రీ చెబుతూ కుప్పకూలినట్టు సమాచారం. వెంటనే పాంటింగ్‌‌ను సమీప ఆసుపత్రికి తరలించారు. పాంటింగ్‌‌ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు ఆసీస్ మీడియా పేర్కొంది. ప్రస్తుతం అతన్ని డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచినట్లు తెలుస్తోంది. పాంటింగ్ కోలుకోవాలని ఫ్యాన్స్ తో పాటు దిగ్గజ క్రికెటర్లు కోరుకుంటున్నారు.

" ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌ మూడో రోజు ఆటలో రికీ పాంటింగ్ అస్వస్థతకు గురయ్యాడు. దాంతో అతను ఈ రోజు కామెంట్రీ‌ బాక్స్‌కు దూరమయ్యాడు . .'అని చానెల్ 7 ప్రతినిధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక పాంటింగ్ అస్వస్థతకు గురయ్యాడని తెలుసుకున్న అతని ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ సైతం గుండె పోటుతోనే ఈ ఏడాది మరణించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ కలవరపాటుకు గురయ్యారు. ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టుకు పాంటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

రికీ పాంటింగ్ కెప్టెన్సీలోనే ఆస్ట్రేలియా తిరుగులేని జట్టుగా అవతరించింది. పాంటింగ్ ప్రస్తుత వయస్సు 47 సంవత్సరాలు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తరఫున 1995–2012 మధ్య ఆడిన రికీ పాంటింగ్.. ఆ జట్టుకు సారథ్యం వహిస్తున్న సమయంలో ప్రపంచలోనే అత్యుత్తమ జట్టుగా ఆసీస్ కొనసాగింది. టెస్టుల్లో ఆయన మొత్తం 41 సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలు చేశాడు. వన్డేల్లో 30 సెంచరీలు 82 హాఫ్ సెంచరీలు సాధించారు. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

First published:

Tags: Australia, Cricket, Delhi Capitals

ఉత్తమ కథలు