రికీ పాంటింగ్ టెస్టు క్రికెట్ డ్రీం టీమ్‌లో కోహ్లీయే కెప్టెన్...

పాంటింగ్ ప్రకటించిన జట్టులో డేవిడ్ వార్నర్, అలస్టైర్ కుక్, కేన్ విలియమ్సన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), కుమార్ సంగక్కర (వికెట్ కీపర్), బెన్ స్టోక్స్, డేల్ స్టెయిన్, నాథన్ లియాన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్‌లకు చోటు దక్కించుకున్నారు.

news18-telugu
Updated: December 30, 2019, 10:26 PM IST
రికీ పాంటింగ్ టెస్టు క్రికెట్ డ్రీం టీమ్‌లో కోహ్లీయే కెప్టెన్...
కోహ్లీ, పాంటింగ్ (ఫైల్ చిత్రం)
  • Share this:
ఆసీస్ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ ఈ దశాబ్దపు టెస్టు క్రికెట్ జట్టును ప్రకటించాడు. ఆ జట్టుకు టీమిండియా సారథి విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా నియమించాడు. తన డ్రీం టీమ్‌ను పాంటింగ్ తన  ఫేస్ బుక్ లో షేర్ చేశాడు. పాంటింగ్ ప్రకటించిన జట్టులో డేవిడ్ వార్నర్, అలస్టైర్ కుక్, కేన్ విలియమ్సన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), కుమార్ సంగక్కర (వికెట్ కీపర్), బెన్ స్టోక్స్, డేల్ స్టెయిన్, నాథన్ లియాన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్‌లకు చోటు దక్కించుకున్నారు. అయితే, పాంటింగ్ డ్రీమ్ లెవన్ జట్టులో ఏడుగురిని ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల నుంచే ఎంచుకోవడంపై పాంటింగ్‌ను కొందరు విమర్శిస్తున్నారు. టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, పేసర్ మహ్మద్ షమీలకు చోటు దక్కలేదు. మహేంద్రసింగ్ ధోనీకి చోటు ఎందుకు దక్కలేదని ప్రశ్నిస్తున్నారు. భారత జట్టు నుంచి కోహ్లీ ఒక్కడినే ఎలా తీసుకుంటారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.First published: December 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు