హోమ్ /వార్తలు /క్రీడలు /

Reliance: AFIతో చేతులు కలిపిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఒలింపిక్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం

Reliance: AFIతో చేతులు కలిపిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఒలింపిక్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం

యువ అథ్లెట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ నీతా అంబానీ

యువ అథ్లెట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ నీతా అంబానీ

Reliance: నీతా అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక భాగస్వామిగా వారి మద్దతుకు తాము చాలా కృతజ్ఞతలు చెబుతున్నామని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆదిల్ సుమరివాలా అన్నారు.

  భారతీయ అథ్లెట్ల సమగ్ర అభివృద్ధికి, దేశ ఒలింపిక్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో చేతులు కలిపింది. రిలయన్స్, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మధ్య ఈ భాగస్వామ్యం యొక్క లక్ష్యం దేశవ్యాప్తంగా ఉన్న భారతీయ అథ్లెట్లను కనుగొనడం, ప్రోత్సహించడం, అభివృద్ధి చేయడం, ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించడమే.

  రిలయన్స్ ఫౌండేషన్, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యం విస్తరిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఐఓసీ సభ్యురాలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ నీతా అంబానీ అన్నారు. అథ్లెటిక్స్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడలలో ఒకటని.. ఈ సంఘం యొక్క లక్ష్యం మన యువ ప్రతిభావంతులకు అవకాశాలు, ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించడం ద్వారా భారతీయ అథ్లెటిక్స్ వృద్ధిని వేగవంతం చేయడం, బాలికలపై ప్రత్యేక దృష్టి సారించడమే అని ఆమె తెలిపారు. .

  రిలయన్స్ ఫౌండేషన్ దృష్టికి అనుగుణంగా, ఈ భాగస్వామ్యం మహిళా అథ్లెట్లపై దృష్టి పెడుతుంది. లింగ వివక్షను తొలగించడం, మహిళా అథ్లెట్ల కలలను సాకారం చేయడం దీని ప్రధాన లక్ష్యం. ప్రధాన జాతీయ, అంతర్జాతీయ పోటీలు, శిక్షణా శిబిరాల్లో AFI ప్రధాన స్పాన్సర్‌గా, రిలయన్స్ బ్రాండ్ జాతీయ జట్టు జెర్సీలు, శిక్షణా కిట్‌లపై కనిపిస్తుంది.

  దేశంలోని వర్ధమాన అథ్లెట్లకు అవకాశాలను అందించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రయత్నం

  భారత ఒలింపిక్ ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో ముఖ్యమైన అడుగు: నీతా అంబానీ

  క్రీడాకారులకు మెరుగైన మౌలిక సదుపాయాలు, శిక్షణ మరియు మద్దతు లభిస్తే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన యువ అథ్లెట్లు ప్లేగ్రౌండ్‌లో గెలుపొందడం మనం ఖచ్చితంగా చూస్తామని నీతా అంబానీ అన్నారు. ఈ భాగస్వామ్యం భారతదేశంలో ఒలింపిక్ ఉద్యమాన్ని బలోపేతం చేయాలనే మా కలలో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని వ్యాఖ్యనించారు.

  రిలయన్స్ ఫౌండేషన్ అథ్లెటిక్స్ జర్నీ

  అథ్లెటిక్స్ అభివృద్ధికి, రిలయన్స్ ఫౌండేషన్ 2017 నుండి రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది, దేశవ్యాప్తంగా 50 కంటే ఎక్కువ జిల్లాల్లోని 5,500 కంటే ఎక్కువ విద్యాసంస్థలకు చేరువైంది. రిలయన్స్ ఫౌండేషన్ సమాజంలోని అన్ని వర్గాల నుండి ఎక్కువ మంది పిల్లలు, యువత క్రీడలు ఆడగలరని నిర్ధారించడానికి ప్రయత్నిస్తుంది.

  రిలయన్స్ ఫౌండేషన్ భారతదేశం తదుపరి ఛాంపియన్‌లను నిర్మించడానికి, ప్రోత్సహించడానికి AFI సహా బహుళ భాగస్వాములతో కలిసి పని చేస్తోంది. భవిష్యత్ ఛాంపియన్‌ల కోసం, ఫౌండేషన్ మౌలిక సదుపాయాల మెరుగుదల, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ సాధికారత ద్వారా బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోంది. భారతదేశ ఒలింపిక్ ఉద్యమానికి నీతా ఎం. అంబానీ నాయకత్వం వహిస్తున్నారు.

  KL Rahul : వెస్టిండీస్ టూర్ కు ఎంపికైన కాబోయే పెళ్లి కొడుకు.! షరతులు వర్తిస్తాయి.!

  IND vs ENG 2nd ODI : పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లండ్.. అయితే ఈసారి రెచ్చిపోయింది మాత్రం ఆ బౌలర్

  నీతా అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక భాగస్వామిగా వారి మద్దతుకు తాము చాలా కృతజ్ఞతలు చెబుతున్నామని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆదిల్ సుమరివాలా అన్నారు. AFI గత కొన్ని సంవత్సరాలుగా ఆమెతో సన్నిహితంగా పనిచేస్తోందని అన్నారు. అంతర్జాతీయ ఈవెంట్లలో భారత అథ్లెటిక్స్ దళం ఎదుగుదల చూశామని తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి నిబద్ధత కలిగిన భాగస్వామితో, అథ్లెటిక్స్‌లోని అనేక క్రీడలలో అధిక భాగస్వామ్యంతో అంతర్జాతీయ విజయాలలో గణనీయమైన పెరుగుదలను త్వరలో చూస్తామని ధీమా వ్యక్తం చేశారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Nita Ambani, Reliance Industries

  ఉత్తమ కథలు