Home /News /sports /

RELIANCE INDUSTRIES BUYS MI EMIRATES IN UAE AND MI CAPE TOWN T20 TEAMS IN SOUTH AFRICA AK

MI One Family: ముంబై ఇండియన్స్‌ బ్రాండ్‌లో కొత్తగా MI ఎమిరేట్స్, MI కేప్ టౌన్ T20 జట్లు..

MI OneFamily Logo

MI OneFamily Logo

Reliance Industries: వన్‌ఫ్యామిలీకి సరికొత్తగా చేరిన 'మి ఎమిరేట్స్', 'మి కేప్ టౌన్'లకు స్వాగతం పలకడం తనకెంతో సంతోషంగా ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ నీతా అంబానీ అన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    ముంబై ఇండియన్స్ యజమాని, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ముంబై ఇండియన్స్ #OneFamilyలో చేరిన రెండు కొత్త ఫ్రాంచైజీల పేరు, బ్రాండ్‌ను ఈ రోజు ఆవిష్కరించింది. UAE ఇంటర్నేషనల్ లీగ్ T20లో 'MI ఎమిరేట్స్' క్రికెట్ దక్షిణాఫ్రికా T20 లీగ్‌లో 'MI కేప్ టౌన్' పేర్లను ఖరారు చేసింది. ముంబై ఇండియన్స్‌తో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్‌ సంస్థకు ఇప్పుడు మూడు టీ20 జట్లు ఉన్నాయి. #వన్‌ఫ్యామిలీకి సరికొత్తగా చేరిన 'మి ఎమిరేట్స్', 'మి కేప్ టౌన్'లకు స్వాగతం పలకడం తనకు ఆనందాన్ని ఇస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ నీతా అంబానీ అన్నారు. తమకు క్రికెట్ కంటే MI ఎక్కువని వ్యాఖ్యానించారు. ఇది తమ ప్రతీక అని తెలిపారు. ఇవన్నీ జీవితంలో సానుకూల దృక్పథాన్ని ప్రోత్సహించడమే అని చెప్పారు. MI ఎమిరేట్స్, MI కేప్ టౌన్ రెండూ ఒకే విధానాన్ని అవలంబిస్తాయనీ, MI ప్రపంచ క్రికెట్ వారసత్వాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయని తాను నమ్ముతున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు.



    'MI ఎమిరేట్స్', 'MI కేప్ టౌన్' పేర్లను ఆయా ప్రాంతాలకు తగ్గట్టుగా ఎంపిక చేశారు. ఈ రెండు ఎమిరేట్స్, కేప్ టౌన్ అభిమానులకు అంకితం చేయబడ్డాయి. రెండు కొత్త జట్లు ఐకానిక్ ముంబై ఇండియన్స్ గుర్తింపును కలిగి ఉన్నాయి. అదే సమయంలో స్థానిక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. #OneFamily గ్లోబల్ విస్తరణ ముంబై ఇండియన్స్‌ను ఫ్రాంచైజీ క్రికెట్‌లో అత్యంత ఇష్టపడే జట్లలో ఒకటిగా మార్చడంలో సహాయపడిన విలువలను లీగ్‌కు తీసుకువస్తుంది.

    Asia Cup 2022 : ఆసియా కప్ జట్టు ఎంపిక విషయంలో బ్లండర్ మిస్టేక్స్ చేసిన బీసీసీఐ.. ఇలా అయితే పాక్ చేతిలో..

    Rohit Sharma : డ్రైవర్ గా రోహిత్.. క్లీనర్ గా కార్తీక్.. వీళ్ల రచ్చ మామూలుగా లేదుగా.. (వీడియో)

    క్రికెట్ ఫ్రాంచైజీ యాజమాన్యం, భారతదేశంలో ఫుట్‌బాల్ లీగ్‌లు, స్పోర్ట్స్ స్పాన్సర్‌షిప్, మెంటర్‌షిప్, అథ్లెట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ద్వారా క్రీడా పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలకపాత్ర పోషిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Mumbai Indians, Nita Ambani, Reliance Industries

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు