ఎన్‌బీఏకు ప్రారంభోత్సవ 'మ్యాచ్‌ బాల్'ను అందించనున్న నీతా అంబానీ

(చిన్నారులతో నీతా అంబానీ)

అక్టోబర్ 4న ముంబైలోని నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా-NSCI వేదికగా జరిగే తొలి ఎన్‌బీఏ గేమ్‌ను ప్రత్యక్షంగా చూసే అరుదైన అవకాశం చిన్నారులకు లభిస్తుంది.

 • Share this:
  భారతదేశంలో తొలిసారి జరగబోయే ఎన్‌బీఏ టోర్నమెంట్‌లో రిలయెన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ ప్రత్యేక గౌరవాన్ని అందుకోనున్నారు. అక్టోబర్ 4న Indiana Pacers vs Sacramento Kings మధ్య జరిగే మ్యాచ్‌కు ఎన్‌బీఏ అధికారులకు ప్రారంభోత్సవ 'మ్యాచ్‌ బాల్'ను అందించనున్నారు నీతా అంబానీ. భారతదేశంలో తొలిసారి ఎన్‌బీఏ టోర్నమెంట్ జరుగుతోంది. ఎన్‌బీఏను భారతదేశానికి అధికారికంగా ఆహ్వానిస్తూ ప్రారంభోత్సవ 'మ్యాచ్‌ బాల్'ను ఎన్‌బీఏ నిర్వాహకులకు అందించనున్నారు. ప్రీసీజన్ గేమ్స్ కోసం భారతదేశంలో ఎన్‌బీఏ నిర్వహిస్తున్న సందర్భంగా ఈ లీగ్‌తో ఉన్న ఆరేళ్ల అనుభవాన్ని 'రిలయెన్స్ ఫౌండేషన్ జూనియర్ ప్రోగ్రామ్' ద్వారా సెలబ్రేట్ చేసుకుంటోంది రిలయెన్స్ ఫౌండేషన్‌. ఇండియాలో ఎన్‌బీఏ ప్రారంభోత్సవం సందర్భంగా జూనియర్ ఎన్‌బీఏ ప్రోగ్రామ్‌లోని చిన్నారుల్ని స్టేడియంకు తీసుకొస్తోంది రిలయెన్స్ ఫౌండేషన్. అక్టోబర్ 4న ముంబైలోని నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా-NSCI వేదికగా జరిగే తొలి ఎన్‌బీఏ గేమ్‌ను ప్రత్యక్షంగా చూసే అరుదైన అవకాశం చిన్నారులకు లభిస్తుంది.

  ఎన్‌బీఏను ఇండియాకు తీసుకురావడాన్ని రిలయెన్స్ ఫౌండేషన్ గర్వంగా భావిస్తోంది. స్టేడియంలో తొలిగేమ్‌ను ప్రత్యక్షంగా చూసే అద్భుతమైన అవకాశం ఈ చిన్నారులకు లభిస్తోంది. ఎన్‌బీఏతో మా ప్రయాణంలో ఇదో కీలకమైన పరిణామం. భారతదేశంలో బాస్కెట్‌బాల్‌పై విశ్వాసం ఉంచినందుకు, అద్భుతమైన ప్రయాణంలో మాతో భాగస్వామిగా ఉన్నందుకు ఎన్‌బీఏకు కృతజ్ఞతలు. విభిన్నమైన క్రీడల్లో భారతదేశం రాణిస్తోంది. 25 ఏళ్ల లోపు 60 కోట్ల మంది యువతతో ప్రపంచంలో మనదే యవ్వనమైన దేశం. క్రీడల్లో భారతదేశం భవిష్యత్తు అందంగా, ఉజ్వలంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను.
  నీతా అంబానీ, రిలయెన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్


  20 రాష్ట్రాల్లోని 34 పట్టణాలకు చెందిన 1.1 కోట్ల మంది పిల్లలకు ఈ గేమ్‌ను పరిచయం చేయడం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద జూనియర్ ఎన్‌బీఏ ప్రోగ్రామ్‌గా పేరు తెచ్చుకోవడం మరో విశేషం. ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో బాస్కెట్ బాల్‌ను చేర్చడం ద్వారా యువత ఆరోగ్యకరమైన, చురుకైన జీవితాన్ని పొందేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతోంది.

  Redmi 8A: నాచ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో రెడ్‌మీ 8ఏ... ఎలా ఉందో చూడండి  ఇవి కూడా చదవండి:

  WhatsApp Banking: వాట్సప్‌లో బ్యాంకింగ్ సేవలు... ఎలా పొందాలో తెలుసుకోండి

  Post Office Scheme: పోస్ట్ ఆఫీస్‌లో టైమ్ డిపాజిట్ అకౌంట్‌... లాభాలేంటో తెలుసా?

  IRCTC: పండుగకు ఊరెళ్తున్నారా? ఈ టెక్నిక్‌తో రైలు టికెట్ కన్ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ
  Published by:Santhosh Kumar S
  First published: