Reliance Foundation : దేశంలో ఫుట్ బాల్ క్రీడకు మరింత ప్రాచుర్యం కలిగించేలా రిలయన్స్ ఫౌండేషన్ (Reliance Foundation) వడి వడిగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఇండియన్ సూపర్ లీగ్ (ISL) ఫుట్ బాల్ టోర్నీకి వెన్నుదన్నగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా మరో అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చిన్నపిల్లల్లో ఫుట్ బాల్ కు మక్కువ కలిగించేలా రిలయన్స్ ఫౌండేషన్ మిజోరం (Mizoram) రాష్ట్రంతో జత కట్టింది. రిలయన్స్ ఫౌండేషన్ యంగ్ చాంప్స్ (RFYC) నౌపంగ్ లీగ్ ను మిజోరం ఫుట్ బాల్ ఆసోసియేషన్ ()తో కలిసి నిర్వహించనుంది. ఈ టోర్నీ బాలురు, బాలికల విభాగంలో జరగనుంది. 6 నుంచి 13 ఏళ్ల బాలబాలికలు ఈ లీగ్ లో ఆడేందుకు అర్హులు. ఈ లీగ్ ద్వారా మిజోరం గ్రామాలతో పాటు చిన్న చిన్న పట్టణాల్లో ఉన్న యువ ప్రతిభను వెలుగులోకి తెస్తారు.
RFYC Naupang (Children) Leagueను మిజోరంలోని నాలుగు ప్రాంతాల్లో నిర్వహిస్తారు. ఈ లీగ్ రెండు మోడల్స్ లో జరుగుతుంది. ఇందులో మొత్తంగా 30 గేమ్స్ జరుగుతాయి. ఇందులో అద్భుతంగా రాణించిన బాలబాలికలను రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ లోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ అధిపతి నితా అంబాని మాట్లాడారు. ‘మిజోరం ప్రజల జీవితంలో ఫుట్ బాల్ ఒక భాగం. రిలయన్స్ ఫౌండేషన్ తలపెట్టిన ఈ లీగ్ ద్వారా ప్రతిభ కలిగిన చిన్న పిల్లలకు ఆధునిక సదుపాయాలతో ఫుట్ బాల్ ట్రయినింగ్ లభిస్తుంది. 5 ఏళ్ల వయసు నుంచే బాలబాలికలు టోర్నీల్లో ఆడే అవకాశం ఉంటుంది. వారిని గొప్ప ప్లేయర్స్ గా ఈ కార్యక్రమం తీర్చి దిద్దే అవకాశం ఉంటుంది‘ అని నితా అంబానీ పేర్కొన్నారు.
RFYS ప్రస్తుతం నార్త్ ఈస్ట్ లో ఫుట్ బాల్ కోసం విశేషంగా కృషి చేస్తుంది. 2016లో గువహటి వేదికగా ఈ ప్రోగ్రామ్ ఆరంభమైంది. ఇందులో ఇండియన్ సూపర్ లీగ్ లో పాల్గొంటున్న జట్లన్ని కూడా చేరాయి. ఇందులో భాగంగా స్కూల్, కాలేజీ లెవల్లో ఫుట్ బాల్ టోర్నీలను నిర్వహిస్తూ ప్రతిభ గల ప్లేయర్లను వెలుగులోకి తెస్తుంది. ఈ ప్లేయర్లు వివిధ ఫ్రాంచైజీల ద్వారా ఇండియన్ సూపర్ లీగ్ లో బరిలోకి కూడా దిగుతున్నారు. ఇక రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా దేశంలో క్రీడలకు ప్రాచుర్యం కలిగిస్తున్నారు. 2013 నుంచి ఇప్పటి వరకు దేశంలోని దాదాపు 2 కోట్లకు మందికి పైగా విద్యార్థులు రిలయన్స్ ఫౌండేషన్ స్పోర్ట్స్ ద్వారా లబ్ధి పొందారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Football, Indian Super League, Nita Ambani, Reliance Foundation, Reliance Industries