హోమ్ /వార్తలు /క్రీడలు /

Reliance AGM 2022 : ఇకపై ఐపీఎల్ ను సరికొత్తగా చూస్తారు : ఆకాశ్ అంబానీ

Reliance AGM 2022 : ఇకపై ఐపీఎల్ ను సరికొత్తగా చూస్తారు : ఆకాశ్ అంబానీ

ముఖేష్ అంబానీతో ఆకాష్ అంబానీ (ఫైల్ ఫోటో)

ముఖేష్ అంబానీతో ఆకాష్ అంబానీ (ఫైల్ ఫోటో)

Reliance AGM 2022 : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) 45వ వార్షిక సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ఇందులో భాగంగా రిలయన్స్ జియో (Jio) చైర్మన్ ఆకాశ్ అంబానీ (Akash Ambani) ప్రసంగించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Reliance AGM 2022 : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) 45వ వార్షిక సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ఇందులో భాగంగా రిలయన్స్ జియో (Jio) చైర్మన్ ఆకాశ్ అంబానీ (Akash Ambani) ప్రసంగించారు. జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాక.. తాము జియో ఎయిర్ ఫైబర్ ను లాంచ్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. జియో ఎయిర్ ఫైబర్ వైర్ లెస్ సర్వీస్ అని ఆయన పేర్కొన్నారు. దీని ద్వారా ఇండియన్ ప్రీమియర్ (IPL)లీగ్ ను చూసే విధానమే మారిపోతుందని ఆకాశ్ పేర్కొన్నారు. 2023 నుంచి 2027 వరకు సంబంధించిన ఐపీఎల్ డిజిటల్ రైట్స్ ను రిలయన్స్ కు చెందిన వయాకమ్ 18 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ పై ఐపీఎల్ మ్యాచ్ లను ఒకే సమయంలో పలు కెమెరా యాంగిల్స్ తో ప్రసారం చేస్తామని ఆయన తెలిపారు. దాంతో ప్రేక్షకులు తమకు నచ్చిన కెమెరా యాంగిల్ ను సెలెక్ట్ చేసుకుని అల్ట్రా హెచ్ డీలో చూసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.


ఏదైనా మ్యాచ్ ను పలు కెమెరాలతో లైవ్ గా ప్రసారం చేస్తుంటారు. అయితే ఏ కెమెరా యాంగిల్ ను ఎప్పుడు టీవీలో కనిపించేలా చేయాలో అనేది మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసారం చేసే ఆపరేటర్ దగ్గర ఉంటుంది. అయితే వచ్చే ఐపీఎల్ నుంచి ఒకే సమయంలో అన్ని కెమెరాల యాంగిల్స్ కూడా మనకు మన టీవీ తెరపై చిన్ని చిన్న బాక్సుల రూపంలో కనిపిస్తూ ఉంటాయి. వీటిలో మనకు నచ్చిన యాంగిల్ ను సెలెక్ట్ చేసుకొని చూడవచ్చు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ ఫార్ములా వన్ రేసింగ్ లో మాత్రమే ఉపయోగిస్తున్నారు. అది కూడా ఎఫ్ 1 టీవీ చందాదారులకు మాత్రమే అనుమతి ఉంది. అయితే ఐపీఎల్ లో కూడా ఈ వెసులుబాటు వస్తుండటం శుభపరిణామయం.


కొన్ని నెలల క్రితం జరిగిన ఐపీఎల్ మీడియా రైట్స్ వేలంలో డిజిటల్ రైట్స్ ను రిలయన్స్ కు చెందిన వయాకమ్ 23 వేల 758 కోట్లకు సొంతం చేసుకోవడం విశేషం. దాంతో వచ్చే సీజన్ నుంచి మనం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఐపీఎల్ మ్యాచ్ లను చూసే అవకాశం లేదు. ఒక ఎక్స్ క్లూజివ్ రైట్స్ ను కూడా వయాకమ్ రూ. 2,991 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక ఉపఖండం ఆవల రైట్స్ ను వయాకమ్, టైమ్స్ ఇంటర్నెట్ సంయుక్తంగా కలిసి రూ. 1324 కోట్లకు సొంతం చేసుకున్నాయి.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Akash Ambani, IPL, Jio, Mukesh Ambani, Reliance

ఉత్తమ కథలు