హోమ్ /వార్తలు /క్రీడలు /

Foot Ball : ఫుట్‌బాల్‌లో కొత్తగా వైట్‌కార్డ్‌... హిస్టరీలో తొలిసారి.. అవసరం లేదంటున్న ఫ్యాన్స్

Foot Ball : ఫుట్‌బాల్‌లో కొత్తగా వైట్‌కార్డ్‌... హిస్టరీలో తొలిసారి.. అవసరం లేదంటున్న ఫ్యాన్స్

PC : TWITTER

PC : TWITTER

Foot Ball : ఫుట్‌బాల్‌ చరిత్రలో మొదటిసారి పోర్చుగల్ వైట్‌కార్డ్‌ను పరిచయం చేసింది. బెంఫికా, స్పోర్టింగ్ లిస్బన్‌ మధ్య జరిగిన మహిళల డెర్బీ మ్యాచ్‌లో దీన్ని సరికొత్తగా ప్రవేశ పెట్టారు. దీన్ని పరిచయం చేసిన కారణం సరైనప్పటికీ అభిమానులకు ఇది మాత్రం నచ్చలేదు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Foot Ball :  ఫుట్‌బాల్‌ (Football) చరిత్రలో మొదటిసారి పోర్చుగల్ (Portugal) వైట్‌కార్డ్‌ను పరిచయం చేసింది. బెంఫికా, స్పోర్టింగ్ లిస్బన్‌ మధ్య జరిగిన మహిళల డెర్బీ మ్యాచ్‌లో దీన్ని సరికొత్తగా ప్రవేశ పెట్టారు. దీన్ని పరిచయం చేసిన కారణం సరైనప్పటికీ అభిమానులకు మాత్రం ఇది నచ్చలేదు. చాలా గందరగోళంగా ఉందని, అనవసరంగా తీసుకొచ్చారని చాలామంది భావిస్తున్నారు. క్రీడలో నైతిక విలువను పెంచటం కోసం ఈ గుర్తును తీసుకొచ్చినట్లు ప్రముఖ ఫుట్‌బాల్‌ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. క్లబ్‌లకు ఫెయిర్-ప్లే గుర్తులు తెలిపేందుకు ఈ వైట్‌కార్డు ఉపయోగించామని వివరించారు. దీంతో జట్ల మధ్య స్పోర్టివ్ నేచర్ పెరుగుతుందని, ఆటగాళ్ల మధ్య సత్సంబంధాలకు దోహదపడుతుందని తెలిపారు.

ఇది కూడా చదవండి  : మీ పిల్లలు స్పోర్ట్స్ లో అదరగొట్టేస్తున్నారా? ఏటా రూ. 5 లక్షల స్కాలర్ షిప్ పొందే అవకాశం.. పూర్తి వివరాలు

ఏంటీ వైట్‌కార్డ్‌?

శనివారం బెంఫికా, స్పోర్టింగ్ లిస్బన్ మధ్య ఉమెన్ కప్‌ మ్యాచ్‌ జరిగింది. ఆ సమయంలో బెంచ్‌లో ఉన్న ఓ క్రీడాకారిణి అనారోగ్యం పాలైనట్లు సమాచారం వచ్చింది. పోటీలో ఉన్న రెండు క్లబ్‌ల నుంచి వైద్య బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ఆ సమయంలో మ్యాచ్‌ రిఫరీ వైట్‌కార్డ్‌ను ప్రదర్శించారు. అంటే, నా జట్టు నీ జట్టు అనే తేడా లేకుండా సహాయం చేసేందుకు అవతలి క్లబ్‌ ముందుకు రావటంపై హర్షం వ్యక్తం చేస్తూ ఈ కార్డ్‌ను ప్రదర్శించారు. చక్కని అంశానికి సూచికగా, 'ఫెయిర్-ప్లే' గుర్తుగా రెండు డగౌట్స్‌కు రిఫరీ ఆ కార్డును చూపించారు.

వేరే రంగులు ఏంటి?

చాలా కాలంగా ఫుట్‌బాల్‌లో యెల్లో-రెడ్‌ కలర్స్‌లో క్రమశిక్షణా కార్డులు మాత్రమే కనిపించాయి. హాకీలో అయితే అదనంగా గ్రీన్ కార్డ్ కూడా ఉంటుంది. అయితే మంచి అంశాలకు గుర్తుగా వైట్‌కార్డ్‌ వినియోగించాలనే ఆలోచన క్రీడాభిమానులకు కొత్తగా అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఫుట్‌బాల్‌ గేమ్‌ చరిత్రలోనే మొదటిసారిగా దీన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు సోషల్‌మీడియాలో దీనిపై జోరుగా చర్చ సాగుతోంది.

 అభిమానుల పెదవి విరుపు

ఈ వైట్‌కార్డ్‌ తీసుకొచ్చిన కారణం మంచిదే అయినప్పటికీ, ఫుట్‌బాల్‌ అభిమానుల నుంచి తగిన ప్రోత్సాహకం కరవైంది. ఇది వింతగా ఉందని, అసలు అవసరమే లేదని అభిమానులు భావిస్తున్నారు. స్పోర్ట్స్ చరిత్రలోనే తీసుకున్న పనికిమాలిన నిర్ణయమని ఫుట్‌బాల్ విశ్లేషకుడు నీల్ ఫిస్లర్ చెప్పారు. ప్రీ మ్యాచ్ హ్యాండ్‌షేక్‌ కంటే తెలివి తక్కువ సంప్రదాయమవుతుందని అభిప్రాయపడుతున్నారు. అసలు ఎందుకు తెచ్చారో అర్థం కావట్లేదని మరికొంత మంది అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఇటీవల తీసుకొచ్చిన కొత్త నిబంధనలను క్రీడాభిమానులు గుర్తు చేసుకున్నారు. మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు లేదా చాలా సేపు ఆగిపోయినప్పుడు వీఏఆర్, 5 సబ్‌స్టిట్యూషన్స్‌ వంటి నిబంధనలను ఇటీవలి సంవత్సరాల్లో తీసుకొచ్చారని అభిమానులు అభిప్రాయపడ్డారు. వాటిపై కూడా జోరుగా చర్చించారు.

First published:

Tags: Foot ball, Football, Sports

ఉత్తమ కథలు