ఆఫ్ఘన్‌పై మ్యాచ్‌లో కొత్త రికార్డులు నెలకొల్పిన షకిబ్..

ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి బంగ్లా బౌలర్‌గా షకిబ్ చరిత్రకెక్కాడు. అలాగే ఇప్పటిదాకా ఆడిన 7 మ్యాచ్‌లలో 476 పరుగులతో టోర్నీలోనే టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

news18-telugu
Updated: June 25, 2019, 8:16 AM IST
ఆఫ్ఘన్‌పై మ్యాచ్‌లో కొత్త రికార్డులు నెలకొల్పిన షకిబ్..
వికెట్ తీసిన జోష్‌లో షకిబ్..
  • Share this:
ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్ వేదికగా బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విజయం బంగ్లానే వరించింది. బ్యాటుతోనూ, బంతితోనూ రాణించిన ఆల్ రౌండర్ షకిబ్ అల్‌హసన్.. బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ వరల్డ్ కప్‌లో బంగ్లా తరుపున అతను మూడోసారి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలవడం విశేషం. మొదట బ్యాటుతో 51(69) అర్ధ శతకం బాదిన షకిబ్.. ఆ తర్వాత బంతితో ఏకంగా ఐదు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.ఓపెనర్లు నైబ్(47),రహమత్ షా(24),అస్గర్ ఆఫ్ఘన్(20), నబి(0),నజీబుల్లా(23) కీలక వికెట్లను తీసి బంగ్లా విజయాన్ని సునాయాసం చేశాడు.షకిబ్ తన తాజా ప్రదర్శన ద్వారా బంగ్లా తరుపున పలు కొత్త రికార్డులను తన పేరిట రాసుకున్నాడు.

ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి బంగ్లా బౌలర్‌గా షకిబ్ చరిత్రకెక్కాడు. అలాగే ఇప్పటిదాకా ఆడిన 7 మ్యాచ్‌లలో 476 పరుగులతో

టోర్నీలోనే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టోర్నీలో డైనమిక్ బ్యాట్స్‌మెన్ ఎంతోమంది ఆడుతున్నా.. ఓ బంగ్లా బ్యాట్స్‌మెన్ టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం.అటు బంతితోనూ రాణిస్తూ ఇప్పటిదాకా ఆడిన మ్యాచ్‌లలో 10 వికెట్లు పడగొట్టాడు.ప్రపంచకప్ మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టడంతో పాటు అర్ధ సెంచరీ చేసిన ఆటగాళ్లు ఇప్పటివరకు యువరాజ్,షకిబ్ మాత్రమే. మొత్తంగాప్రపంచకప్‌ టోర్నీల్లో 1016 పరుగులు, 33 వికెట్లు పడగొట్టిన రెండో ఆల్‌రౌండర్‌గా షకిబ్ రికార్డ్ నెలకొల్పాడు. షకిబ్‌ కంటే ముందు ఆ స్థానంలో లంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య ఉన్నాడు. ప్రపంచ కప్ టోర్నీల్లో అతను 1165 పరుగులతో పాటు 27 వికెట్లు పడగొట్టాడు.
Published by: Srinivas Mittapalli
First published: June 25, 2019, 7:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading