హోమ్ /వార్తలు /క్రీడలు /

RCB vs DC: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ.. కోహ్లీ సేన ఢిల్లీపై గెలిచి రెండో స్థానం దక్కించుకునేనా?

RCB vs DC: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ.. కోహ్లీ సేన ఢిల్లీపై గెలిచి రెండో స్థానం దక్కించుకునేనా?

టాస్ గెలిచి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్న ఆర్సీబీ (PC: IPL)

టాస్ గెలిచి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్న ఆర్సీబీ (PC: IPL)

RCB vs DD: ఐపీఎల్ 2021లో భాగంగా ఇవాళ ఢిల్లీ - బెంగళూరు మధ్య కీలక మ్యాచ్ జరుగనున్నది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఐపీఎల్ 2021కు (IPL 2021) ఇప్పటికే క్వాలిఫై అయి అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), మూడో స్థానంలో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) ఇవాళ చివరి మ్యాచ్ ఆడనున్నాయి. టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) బౌలింగ్ చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీపై కనుక భారీ తేడాతో గెలిస్తే కోహ్లీ సేనకు రెండో స్థానానికి చేరుకునే అవకాశం ఉన్నది. కానీ అది దాదాపు అసాధ్యమే అని చెప్పుకోవచ్చు. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నారు. పిచ్ కాస్త డ్రైగా ఉండి పిచ్‌పై పచ్చిక ఉండటంతోనే బౌలింగ్ ఎంచుకున్నట్లు కోహ్లీ చెప్పాడు.

ఇక అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మరో 2 పాయింట్లు సాధించాలనే తపనతో ఉన్నది. ప్రస్తుతం వారి ఫామ్‌ను చూస్తే ఈ మ్యాచ్ కూడా గెలిచే అవకాశం ఉన్నది. టాస్ ఓడినా.. తాము బ్యాటింగ్ చేసి పెద్ద టార్గెట్ సెట్ చేస్తామని రిషబ్ పంత్ (Rishabh Pant) చెప్పాడు. జట్టులో ఎలాంటి మార్పులు లేవని పంత్ చెప్పాడు.


ఇరు జట్లు ఈ సీజన్‌లో మంచి ప్రదర్శనే చేశాయి. ఇరు జట్లలో ఉన్న ఆటగాళ్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇదొక ఆసక్తికరమైన మ్యాచ్‌గా మారబోతున్నది.

First published:

Tags: Delhi Capitals, IPL 2021, Royal Challengers Bangalore

ఉత్తమ కథలు