RCB VS MI THE TRACK RECORD FOR THE CURRENT YEAR IS AS FOLLOWS EVK
RCB vs MI : ఆర్సీబీ - ఎంఐలో ఎవరిది పైచేయి.. ఇప్పటి వరకు ట్రాక్ రికార్డ్ తెలుసుకోండి
MI vs RCB
ఎంతో రసవత్తరంగా సాగుతున్న ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్ 2లో మరో పెద్ద మ్యాచ్ జరుగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) ఈ రోజు రాత్రి ముంబై ఇండియన్స్‌తో తలపడుతుంది. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య ట్రాక్ రికార్డు వివరాలు.
ఎంతో రసవత్తరంగా సాగుతున్న ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్ 2లో మరో పెద్ద మ్యాచ్ జరుగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) ఈ రోజు రాత్రి ముంబై ఇండియన్స్‌తో తలపడుతుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు వేదిక కానుంది. ఇలాఉ విరాట్ ఫాన్స్, అటు రోహిత్ అభిమానులు మ్యాచ్‌కు ముందే తమ టీం గెలుస్తోంది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఐపీఎల్లో దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం 39వ మ్యాచ్‌కు వేదికగా మారింది. రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ (Mumbai Indians) టీంలకు ఈ మ్యాచ్ ముఖ్యం తిరిగి విజయాల బాట పట్టేదుకు ఈ మ్యాచ్ అవసరం. అసలు ఈ రెండు టీంలు ఇప్పటి వరకు ఎన్ని మ్యాచ్‌లు తలపడ్డాయి. ఎవరు ఎక్కువ గెలిచారు. ఈ రోజు పోటీ ఎలా ఉండబోతుందో అని అభిమానులు లెక్కలు వేస్తున్నారు.
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో మొదటి సారిగా MI మరియు RCB ఐపిఎల్ 2021 సీజన్ ప్రారంభోత్సవం తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఈ రెండో సీజన్లో కూడా గెలిచి ముంబైపై పూర్తి పట్టు సాధించాలని ఆర్సీబీ పట్టుదలతో ఉంది. ఈ రెండు జట్లు ప్రతీ సీజన్లోనూ తలపడుతున్నాయి. వారి మధ్య పోటీ క్రికెట్ అభిమానులను అలరిస్తూనే ఉంది. పోటా పోటీగా తలపడే ఈ జట్ల మధ్య మ్యాచ్ ఎప్పుడు ఉత్కంఠను కలిగిస్తూనే ఉంటుంది.
"This team certainly knows how to perform under pressure." 💪💙
ఇప్పటి వరకు ఐపీఎల్ అన్ని సీజన్లలో కలిపి ఈ రెండు జల్లు 30 మ్యాచ్‌లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌ల గణాంకాల ప్రకారం ముంబై ఇండియన్స్ ఎక్కువ విజయాలను సొంతం చేసుకొంది. ముంబై ఇండియన్స్ 19 మ్యాచ్‌లు గెలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్‌పై 11 మ్యాచ్‌లు గెలిచింది. ఎక్కువ విజయాలు ముంబై వైపే ఉన్నా.. ప్రతీ మ్యాచ్ చాలా పోటాపోటీగా జరిగాయి. గతఐదు మ్యాచ్‌లలో MI టీం RCBపై మూడు విజయాలు నమోదు చేసింది. కానీ యూఏఈ లో జరిగిన మ్యాచ్‌లలో మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆధిక్యంలో ఉంది. ముంబైపై 2-1 మ్యాచ్‌ల గెలుపు రికార్డు ఆర్సీబీకి ఉంది.
ఇండియన్ స్కిప్పరల్, ఆర్సీబీ క్యాప్టెన్ విరాట్ కోహ్లీ ఎంఐతో తలపడిన మ్యాచ్‌లలో మొత్తం 728 పరుగులు చేశారు. ముంబై పై విరాట్ అత్యధిక స్కోర్ 92. ఇక ముంబై టీం నుంచి చూస్తే కీరాన్ పొలార్డ్ ఆర్సీబీపై 546 పరుగులు చేశాడు. అతనికి బెంగుళూర్పై అత్యధిక స్ట్రైక్ రేట్ 161.54 ఉంది. ఇక బోలర్ల విషయానికి వస్తే ఆర్సీబీ వర్సెస్ ముంబై మ్యాచ్‌లలో జస్ప్రీత్ బుమ్రా 21 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం బుమ్రా ముంబై తరుపున అధిక వికెట్లు తీసిన వ్యక్తి. అంతే కాకుండా ఆర్సీబీ తరుఫున ఆడుతున్న హర్షల్ పటేల్ ఇప్పటి వరకు 11 ముంబై ఇండియన్ వికెట్లు తీశాడు. అంతే కాకుండా ఈ ఐపీఎల్లో ముంబైకి వ్యతిరేకంగా ఐదు వికెట్లు తీసిన మొదటి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ సీజన్ 2లో ముంబై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఉత్కంఠగా ఉంటుందనడంలో సందేహం లేదు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.