RCB vs KKR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ.. ఐపీఎల్‌లో అరంగేట్రం చేయనున్న ఆంధ్రా క్రికెటర్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లీ.. కేఎస్ భరత్ అరంగేట్రం (PC: IPL)

ఐపీఎల్ 2021లో భాగంగా అబుదాబి వేదికగా ఆర్సీబీ - కేకేఆర్ మధ్య మ్యాచ్ జరుగుతున్నది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇది కోహ్లీకి 200వ ఐపీఎల్ మ్యాచ్ కాగా.. ఆంద్రా క్రికెటర్ కేఎస్ భరత్ మెగా లీగ్‌లో అరంగేట్రం చేస్తున్నాడు.

  • Share this:
    ఐపీఎల్ 2021లో (IPL 2021) మ్యాచ్ నెంబర్ 31 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) - కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) మధ్య సోమవారం అబుదాబి వేదికగా జరుగుతున్నది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆర్సీబీ జట్టు ఈ సీజన్‌లో మూడో స్థానంలో ఉన్నది. 7 మ్యాచ్‌లు ఆడి ఐదు గెలిచి 10 పాయింట్లు సాధించింది. ఈ మ్యాచ్ గెలవడం ద్వారా పాయింట్ల పట్టికలో మరింత మెరుగైన స్థానంలో నిలవాలని కోహ్లీ సేన కోరుకుంటున్నది. పలువురు విదేశీ ప్లేయర్ల గైర్హాజరీ నేపథ్యంలో ఇద్దరు క్రికెటర్లు ఆర్సీబీ తరపున ఐపీఎల్‌లో అరంగేట్రం చేస్తున్నారు. శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగ, ఆంధ్రా వికెట్ కీపర్ - బ్యాట్స్‌మాన్ కేఎస్ భరత్ (KS Bharat) తొలి సారిగా ఐపీఎల్ ఆడనున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇది 200వ ఐపీఎల్ మ్యాచ్ కావడం గమనార్హం. ఈ రోజు ఆర్సీబీ జట్టు నీలి రంగు జెర్సీల్లో బరిలోకి దిగనున్నారు.

    ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఈ సీజన్‌లో ఇప్పటి వరకు నిరాశాజనకమైన ప్రదర్శన చేసింది. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ కేవలం రెండింటలోనే విజయం సాధించి నాలుగు పాయింగ్లతో 7వ స్థానంలో ఉన్నది. స్టార్ ఆల్‌రౌండర్ పాట్ కమిన్స్ దూరం కావడం జట్టుకు పెద్ద లోటని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ ద్వారా వెంకటేష్ అయ్యర్ కేకేఆర్ తరపున అరంగేట్రం చేస్తున్నాడు.

    Team India: ఇక వరుసగా హోమ్ సిరీస్‌లు.. టీమ్ ఇండియా షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ


     Many congratulations to @imVkohli who is all set to play his 200th IPL game for @RCBTweets 👏👏

    He now becomes the 5th player to play 200 IPL games.#VIVOIPL pic.twitter.com/wuIDVDu1Uf










    ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో మొత్తం 28 సార్లు కేకేఆర్ - ఆర్సీబీ జట్లు తలపడ్డాయి. ఇందులో కేకేఆర్ జట్టు 15 మ్యాచ్‌లు గెలవగా.. ఆర్సీబీ 13 మ్యాచ్‌లు గెలిచింది. అబుదాబి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
    Published by:John Naveen Kora
    First published: