RCB Vs KKR: వారేవా చక్రవర్తి, రస్సెల్.. కోల్‌కతా బౌలర్ల ధాటికి కుప్పకూలిన ఆర్సీబీ.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే

కోల్‌కతా బౌలర్ల ధాటికి 92 పరుగులకే ఆలౌట్ అయిన బెంగళూరు (PC: IPL)

RCB vs KKR: ఐపీఎల్ 2021లె భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 92 పరుగులకే ఆలౌట్ అయ్యింది. వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రస్సెల్ తమ బౌలింగ్‌తో ఆర్సీబీని కుప్ప కూల్చారు.

  • Share this:
    ఐపీఎల్ 2021లో (IPL 2021) భాగంగా అబుదాబి వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) - కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) మధ్య మ్యాచ్ జరుగుతున్నది. ఆర్సీబీ జట్టు 19 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌట్ అయ్యింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీకి (Virat Kohli) అది ఎంత తప్పుడు నిర్ణయమో కాసేపట్లోనే తెలిసిపోయింది. పేసర్లు టాపార్డర్‌ను కూల్చేయగా.. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) స్పిన్ ధాటికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కోలుకోలేనంతగా దెబ్బతిన్నది. 200వ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్ కలసి ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఒక ఫోర్ కొట్టి మంచి టచ్‌లో కనిపించిన విరాట్ కోహ్లీ (5) ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ రూపంలో అవుటయ్యాడు. ధాటిగా ఆడుతున్న దేవ్‌దత్ పడిక్కల్ (22) ఫెర్గూసన్ బౌలింగ్‌లో కీపర్ దినేశ్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇక ఆండ్రీ రస్సెల్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీశాడు. అరంగేట్రం బ్యాట్స్‌మాన్ కేఎస్ భరత్ (16) రస్సెల్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఇక మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ (0) తొలి బంతికే అవుటై గోల్డెన్ డక్ సాధించాడు. ఆండ్రీ రస్సెల్ వేసిన అద్భుతమైన యార్కర్‌కు ఏబీడీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

    ఆ తర్వాత కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కోలుకోకుండా చేశాడు వరుణ్ చక్రవర్తి. తన మిస్టరీ స్పిన్నింగ్ బంతులతో గ్లెన్ మ్యాక్స్‌వెల్ (10)ను బౌల్డ్ చేశాడు. తొలి మ్యాచ్ ఆడుతున్న వానిందు హసరంగ (0) వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సచిన్ బేబీ కూడా వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. ఇలా వరుసగా వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి ఆర్సీబీ పతనానికి కారణమయ్యాడు. కేల్ జేమిసన్ (4) రనౌట్ అవగా.. హర్షల్ పటేల్‌ (12) ఫెర్గూసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివర్లో మహ్మద్ సిరాజ్ (8), యజువేంద్ర చాహల్ (2) పరుగులు రాబట్టడానికి ప్రయత్నించినా కేకేఆర్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పరుగులు రాకుండా చేసింది. చివర్లో సిరాజ్ (12) ఆండ్రీ రస్సెల్ బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఆర్సీబీ జట్టు 19 ఓవర్లలో 92 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

    Team India: ఇక వరుసగా హోమ్ సిరీస్‌లు.. టీమ్ ఇండియా షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ


     










    మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కేవలం 13 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఆండ్రీ రస్సెల్ 3, ఫెర్గూసన్ 2 వికెట్లు తీయగా.. ప్రసిధ్ కృష్ణకు ఒక వికెట్ లభించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు గెలవడానికి 20 ఓవర్లలో 93 పరుగులు చేయాల్సి ఉన్నది. అయితే పిచ్ బౌలర్లకు సహకరిస్తుండటంతో ఆర్సీబీ బౌలర్లు ఏమైనా మ్యాజిక్ చేస్తారేమో చూడాల్సి ఉన్నది.
    Published by:John Naveen Kora
    First published: