RCB VS GT LIVE SCORES ROYAL CHALLENGERS BANGALORE WON THE TOSS AND ELECTED TO BAT FIRST SJN
RCB vs GT : టాస్ గెలిచిన ఆర్సీబీ.. ఊహించని నిర్ణయం తీసుకున్న డు ప్లెసిస్
గుజరాత్ టైటాన్స్ వర్సెస్ డు ప్లెసిస్ (PC : IPL)
RCB vs GT : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా మరికాసేపట్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers Bangalore), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది.
RCB vs GT : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా మరికాసేపట్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers Bangalore), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఊహించని విధంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్ లో టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకోవడం ఇది రెండోసారి మాత్రమే కావడం విశేషం. ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ ఒక మార్పు చేసింది. ప్రభుదేశాయ్ ని పక్కన పెట్టిన ఆర్సీబీ అతడి ప్లేస్ లో మహిపాల్ లొమ్రోర్ కు తుది జట్టులో అవకాశం ఇచ్చింది. ఇక గుజరాత్ టైటాన్స్ రెండు మార్పులు చేసింది. యశ్ దయాల్, అభినవ్ మనోహర్ లను పక్కన పెట్టిన గుజరాత్ ప్రదీప్ సంగ్వాన్, సాయి సుదర్శన్ లకు అవకాశం ఇచ్చింది.
విరాట్ కోహ్లీ ఎన్నడూ లేనంతగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. గత నాలుగు మ్యాచ్ ల్లోనూ పెద్దగా పరుగులు సాధించని అతడి ఫామ్ పై అటు మాజీ క్రికెటర్ల నుంచి ఇటు క్రికెట్ అభిమానుల వరకు విమర్శలు వస్తున్నాయి. ఈ మ్యాచ్ లోనైనా అతడు రాణించాలి. తర్వాతి మ్యాచ్ ల్లో అతడి ప్లేస్ పై అనుమానాలు తలెత్తే అవకాశం ఉంది. కోహ్లీతో పాటు గత రెండు మ్యాచ్ ల్లోనూ గ్లెన్ మ్యాక్స్ వెల్ పెద్దగా ఆడలేదు. అతడు కూడా ఫామ్ లోకి రావాల్సిన అవసరం ఉంది. డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, మ్యాక్స్ వెల్ ,దినేశ్ కార్తీక్ తమ బ్యాట్ కు పని చెప్తే ఆర్సీబీ భారీ స్కోరు సాధించే అవకాశం ఉంది.
ప్లే ఆఫ్స్ పై కన్నేసిన గుజరాత్
హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ సూపర్ ఫామ్ లో ఉంది. ఆఖరి బంతికి మ్యాచ్ ను గెలవడాన్ని ఆనవాయితీగా పెట్టుకున్న గుజరాత్ కు అన్నీ కలిసొస్తున్నాయి. బ్యాటర్లు విఫలమైనా లోయర్ ఆర్డర్ లో తెవాటియా, రషీద్ ఖాన్ లు జట్టుకు విజయాలను అందిస్తున్నారు. ఈ మ్యాచ్ లో గుజరాత్ గెలిస్తే 8 విజయాలతో 16 పాయింట్లు సాధించనట్లవుతుంది. అంటే దాదాపు ప్లే ఆఫ్స్ కు చేరినట్లే లెక్క.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.