హోమ్ /వార్తలు /క్రీడలు /

RCB vs DC: ఢిల్లీ జోరుకు కళ్లెం వేసిన బెంగళూరు.. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. అద్భుత విజయాన్ని అందించిన భరత్

RCB vs DC: ఢిల్లీ జోరుకు కళ్లెం వేసిన బెంగళూరు.. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. అద్భుత విజయాన్ని అందించిన భరత్

ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అద్బుత విజయం (PC: IPL)

ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అద్బుత విజయం (PC: IPL)

RCB vs DC: ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాల జోరుకు బెంగళూరు కళ్లెం వేసింది. ఆఖరి బంతికి సిక్స్ కొట్టిన శ్రీకర్ భరత్ అద్బుత విజయాన్ని అందించాడు.

ఇంకా చదవండి ...

  ఐపీఎల్ 2021లో (IPL 2021) అంచనాలను మించి రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals).. ప్రతీ మ్యాచ్‌లో తమ జోరును కొనసాగిస్తున్నది. ఇప్పటికే పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ జోరుకు బెంగళూరు కళ్లెం వేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 165 పరుగుల టార్గెట్‌ను ఛేదించడానికి బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) జట్టుకు సరైన ఆరంభం లభించలేదు. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు దేవ్‌దత్ పడిక్కల్ (0), విరాట్ కోహ్లీ (4) తక్కువ స్కోరుకే అవుటయ్యాడరు. ఆ తర్వాత శ్రీకర్ భరత్, ఏబీ డివిలియర్స్ కలసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. భరత్ తన ఫామ్‌ను కొనసాగించగా.. ఏబీ డివిలియర్స్ మాత్రం తన సహజ శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడాడు. వీరిద్దరూ కలసి మూడు వికెట్‌కు 49 పరుగులు చేశారు. ఏబీ డివిలియర్స్ (26) అక్షర్ పటేల్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మూడు కీలకమైన వికెట్లు 55 పరుగులకే కోల్పోయి ఆర్సీబీ కష్టాల్లో పడింది. అంతే కాకుండా 10 ఓవర్లలో 100కు పైగా పరుగులు ఛేదించాల్సి రావడంతో ఆర్సీబీ గెలుస్తుందా అనే అనుమానాలు వచ్చాయి.

  కాగా, శ్రీకర్ భరత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ కలసి ఢిల్లీ బౌలర్లను ధీటుగా ఎదుర్కున్నారు. వీరిద్దరూ బౌండరీలు బాదుతూ స్కోర్ వేగాన్ని పెంచారు. శ్రీకర్ భరత్ సిక్సులు, ఫోర్లతో విరుచుకపడ్డాడు. వికెట్ కోల్పోకుండా ఇద్దరు బ్యాటర్లు ఢిల్లీ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. ఈ క్రమంలో భరత్, మ్యాక్సీ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఇక ఆఖరి ఓవర్లో 15 పరుగులు అవసరమైన సమయంలో మ్యాక్ వెల్ తొలి మూడు బంతులు ఆడి 7 పరుగులు సాధించాడు. ఇక శ్రీకర్ భరత్ 4వ బంతికి డాట్ బాల్, ఐదో బంతికి రెండు పరుగులు తీశాడు. ఆరో బంతి వైడ్ కావడంతో మరో ఎక్స్‌ట్రా బంతి వచ్చింది. ఆఖరి బంతికి 5 పరుగులు కావల్సిన సందర్భంలో భరత్ భారీ సిక్స్ కొట్టి ఆర్సీబీని గెలిపించాడు. ఈ విజయంతో ఆర్సీబీ 18 పాయింట్లకు చేరుకున్నది. అయితే మెరుగైన రన్‌రేట్‌తో చెన్నై రెండో స్థానాన్ని నిలుపుకున్నది.

  T20 World Cup: రేపు బీసీసీఐ, సెలెక్టర్ల కీలక భేటీ.. టీమ్ ఇండియాలో భారీ మార్పులు.. కొత్త వారికి చోటు?  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అక్టోబర్ 11న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనున్నది. అందులో గెలిచిన జట్టు ఢిల్లీ లేదా చెన్నైతో రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడతాయి. ఇక చెన్నై, ఢిల్లీ ఈ నెల 10న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ఆడనున్నాయి.

  Published by:John Kora
  First published:

  Tags: Delhi Capitals, IPL 2021, Royal Challengers Bangalore

  ఉత్తమ కథలు