Vikas Tokas: ఫైన్ కట్టనని వికాస్ చెప్పడంతో.. పోలీసులు అతడి కారులో కూర్చొని దుర్భాషలాడారు. పూరన్ మీనా అనే పోలీసు తనపై దాడి చేశాడని..కంటిపై పంచ్ ఇవ్వడంతో గాయమయిందని వికాస్ ఆరోపిస్తున్నాడు. తాను రైఫిల్‌తో పారిపోతుండగా పట్టుకున్నట్లు తప్పుడు కేసులుపెట్టారని సంచలన ఆరోపణలు చేశాడు.
విరాట్ కొహ్లీ(Virat Kohli) టీమ్ మేట్‌పై ఢిల్లీ పోలీసులు దాడి చేశారు. కొహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)లో సభ్యుడిగా ఉన్న భారత ఆటగాడిపై ఢిల్లీ పోలీసులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ANI వార్తా సంస్థ కథనం ప్రకారం.. జనవరి 26న అంటే గణతంత్ర దినోత్సవం రోజున RCB ఆటగాడు వికాస్ టొకాస్ (Vikas Tokas)ను ఢిల్లీ పోలీసులు దారుణంగా కొట్టారు. అతడిపై పిడిగుద్దులు కురిపించారు. పోలీసుల దాడిలో వికాస్ కన్ను కింది భాగంలో గాయమైంది. ఈ ఘటనపై ఢిల్లీ పోలీస్ (Delhi Police) హెడ్ క్వార్టర్స్‌లో అతడు ఫిర్యాదు చేశాడు.
వికాస్ టొకాస్ చెప్పిన వివరాల ప్రకారం.. జనవరి 26న ఢిల్లీ శివారులోని తన గ్రామం (భికాజీ కామా పోలీస్ స్టేషన్ పరిధి)లో క్రికెటర్ వికాస్ టొకాస్ కారు పోలీసులు ఆపి తనిఖీ చేశారు. ఆ సమయంలో అతడు మాస్క్ ధరించకపోవడంతో పోలీసులు నిలదీశారు. మాస్క్ పెట్టుకోనందుకు రూ.2వేలు ఫైన్ కట్టాలని చెప్పారు. కానీ ఫైన్ కట్టనని వికాస్ చెప్పడంతో.. పోలీసులు అతడి కారులో కూర్చొని దుర్భాషలాడారు. ఈ క్రమంలోనే పూరన్ మీనా అనే పోలీసు తనపై దాడి చేశాడని..కంటిపై పంచ్ ఇవ్వడంతో గాయమయిందని వికాస్ ఆరోపిస్తున్నాడు. తాను రైఫిల్‌తో పారిపోతుండగా పట్టుకున్నట్లు తప్పుడు కేసులుపెట్టారని సంచలన ఆరోపణలు చేశాడు.
అంతేకాదు తన ఫోన్‌ను కూడా పోలీసులు దొంగిలించారని అతడు ఆరోపించాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో రాజీకి యత్నించారని.. తామే తప్పు చేశామని, దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవద్దని కోరినట్లు వెల్లడించాడు. కానీ తనకు అవమానం జరిగిందని..అందుకే వానిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డీసీపీపి లేఖ రాసినట్లు వికాస్ పేర్కొన్నాడు.
They snatched my phone. Later one of the personnel at the station told me to compromise saying that they made a mistake...They were pressuring me not to take any action...I have sent an email to DCP and CP demanding suspension of Puran Meena & one other: IPL cricketer Vikas Tokas pic.twitter.com/TmHgFw2IBc
ఐతే పోలీసుల వర్షన్ మాత్రం మరోలా ఉంది. మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని అడిగితే.. తమకే ఎదరు తిరిగాడని చెబుతున్నారు. నేను నేషనల్ క్రికెట్ ప్లేయర్‌ని, నాకే ఫైన్ వేస్తారా? అని తిట్టాడని ఆరోపిస్తున్నారు.
''జనవరి 26న సాధారణ తనిఖీల్లో భాగంగా వికాస్ టొకాస్ కారును తనిఖీ చేశాం. పబ్లిక్ ప్లేస్‌లో మాస్క్ ఎందుకు ధరించలేదని అడిగితే పోలీసుల పట్ల దుర్భాషలాడాడు. జాతీయ స్థాయి క్రికెటర్ ఓ కానిస్టేబుల్ స్థాయి అధికారి ఎలా ఆపుతాడంటూ గొడవపెట్టుకున్నాడు. పీఎస్‌కు రావాలని అడిగితే.. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. పోలీసులు వెంటనే కారును ఆపారు. ఈ తోపులాటలో అనుకోకుండా యాదృచ్ఛికంగా అతడి కంటికి గాయమయింది. పోలీసులు కావాలని కొట్టలేదు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లాం. అక్కడ వికాస్‌తో పాటు ఆయన తండ్రి కూడా రాతపూర్వక క్షమాపణలు చెప్పారు. అనంతరం ఇద్దరిని విడిచిపెట్టాం. కానీ ఇప్పుడేమో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.'' అని సౌత్ వెస్ట్ డీసీపీ గౌరవ్ శర్మ పేర్కొన్నారు.
When asked to come to PS, he tried to drive away. Police stopped the car &in a scuffle, he was accidentally hit near the eye. He was taken to PS, where he & his father-in-law gave an apology in writing; was set free but is now making false complaints: DCP South West Gaurav Sharma
కాగా, వికాస్ టొకాస్ 2016లో ఐపీఎల్లో ఆర్సీబీ తరపున ఆడాడు. ఆ తర్వాత మళ్లీ ఐపీఎల్లో కనిపించలేదు. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.