Home /News /sports /

RCB TO CHANGE THEIR JERSEY FROM RED AND BLACK TO BLUE A HEART MELTING STORY BEHIND THIS CHANGE JNK

IPL 2021 : బ్లూ జెర్సీకి మారనున్న కోహ్లీ సేన.. రాయల్ చాలెంజర్స్ నిర్ణయం వెనుక కంట తడి పెట్టించే కథనం

బ్లూ జెర్సీలో దర్శనం ఇవ్వనున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు

బ్లూ జెర్సీలో దర్శనం ఇవ్వనున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు

    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) జట్టు రాబోయే మ్యాచ్‌లలో ఏదో ఒక దానిలో బ్లూ జర్సీలతో (Blue Jersey) బరిలోకి దిగనున్నది. ఐపీఎల్‌లో (IPL 2021) రెడ్ అండ్ బ్లాక్ కలర్స్ జర్సీలతో మ్యాచ్‌లు ఆడుతున్న కోహ్లీ సేన ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లలో ఒక దాన్ని బ్లూ జెర్సీతో ఆడనున్నట్లు ప్రకటించింది. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి నేటి వరకు డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, పారిశుథ్య కార్మికులు పీపీఈ కిట్లు ధరించి పూర్తి సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా వైద్య రంగంలోని సిబ్బంది కరోనా రోగుల సేవలో పూర్తిగా నిమగ్నమయ్యారు. డ్యూటీలో ఉన్నంత సేపు నీలి రంగులోని పీపీఈ కిట్లు ధరించి అలసట లేకుండా పని చేస్తున్నారు. వారికి సంఘీభావంగా ఒక మ్యాచ్‌లో బ్లూ జెర్సీలతో మ్యాచ్ ఆడనున్నట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. మ్యాచ్ రోజు క్రికెటర్లు ధరించిన జెర్సీలపై వారు సంతకం చేసి వేలం వేస్తారని.. అలా వచ్చిన ఆదాయాన్ని వైద్య రంగంలో మౌళిక సదుపాయాలను మెరుగు పరచడానికి ఉపయోగిస్తామని ఆర్సీబీ యాజమాన్యం తెలిపింది. ఆసుపత్రుల్లో మౌళిక సదుపాయాలకు తోడు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను కొనడానికి కూడా వినియోగించనున్నారు.

    మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దీనితో పాటు మరి కొంత మొత్తాన్ని తమ సొంత డబ్బు నుంచి అందిస్తామని చెప్పారు. ఈ డబ్బును ఆక్సిజన్ కొనుగోలుకు వినియోగించనున్నారు. ఐపీఎల్‌లో ప్రతీ ఏడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సమాజ సేవ కోసం ఒక మ్యాచ్‌ను వినియోగించకుంటున్నది. గత ఏడాది గ్రీన్ జెర్సీలతో మ్యాచ్ ఆడింది. ప్రపంచంలో పెరిగిపోతున్న వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో గ్రీన్ జెర్సీలను ధరించింది. అంతే కాకుండా ఆ జెర్సీలను రీసైక్లింగ్ వేస్ట్ నుంచి తయారు చేయడం గమనార్హం. ఇలా ప్రతీ ఏడాది తీవ్రమైన సమస్యల పట్ల స్పందిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించడానికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం ఒక వినూత్న జెర్సీతో మ్యాచ్ ఆడుతున్నది.





    కాగా, ఈ సీజన్‌లో కోహ్లీ సేన వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానానికి చేరుకున్నది. అయితే గత మూడు మ్యాచ్‌లలో రెండింటిలో ఓడిపోయి మూడో స్థానానికి పడిపోయింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఎనిమిది మ్యాచ్‌లలో ఆరు గెలిచి టేబుల్‌లో అగ్రస్థానానికి చేరుకున్నది. ఈ రోజు జరుగనున్న కీలక మ్యాచ్‌లో రాయల్ చాలెంజరస్ బెంగళూరు జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో తలపడనున్నది.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Anushka Sharma, IPL 2021, Royal Challengers Bangalore, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు