హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2021: వాళ్లిద్దరి కోసం ప్రత్యేక విమానం.. ఇంగ్లాండ్ నుంచి యూఏఈకి తరలించడానకి ఆ ఫ్రాంచైజీ ప్లాన్

IPL 2021: వాళ్లిద్దరి కోసం ప్రత్యేక విమానం.. ఇంగ్లాండ్ నుంచి యూఏఈకి తరలించడానకి ఆ ఫ్రాంచైజీ ప్లాన్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇంగ్లాండ్ టూర్ అర్దాంతరంగా రద్దు కావడంతో టీమ్ ఇండియా క్రికెటర్లు ఐపీఎల్ 2021 కోసం యూఏఈ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్‌ల కోసం ఆర్సీబీ యాజమాన్యం ప్రత్యేక విమానం పంపనున్నట్లు సమాచారం.

    టీమ్ ఇండియా ఆడాల్సిన 5వ టెస్టు కోవిడ్ కారణంగా రద్దు చేయడంతో ఆటగాళ్లు అందరూ ఇంగ్లాండ్ వదిలి వచ్చేస్తున్నారు. మరో వారం రోజుల్లో ఐపీఎల్‌ 2021 రెండవ ఫేజ్ ప్రారంభం కానుండటంతో ఇంగ్లండ్‌ టూర్‌లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు యూఏఈకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తమ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, మహ్మద్‌ సిరాజ్‌ల కోసం ప్రత్యేక చార్టర్‌ ఫ్లైట్‌ను లండన్‌కు పంపించనుంది. ప్రత్యేక విమానంలో దుబాయ్‌కి చేరుకోనున్న ఈ ఇద్దరు ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఈ విషయాన్ని ఆర్‌సీబీ ఒక ప్రకటనలో తెలిపింది. కోహ్లి, సిరాజ్‌ల కోసం ప్రత్యేక చార్టర్‌ ఫ్లైట్‌ను సిద్ధం చేశాం. శనివారం రాత్రి కోహ్లి, సిరాజ్‌లు చార్టర్‌ ఫ్లైట్‌ ఎక్కుతారు.. ఆదివారం ఉదయం దుబాయ్‌లో దిగిన వెంటనే నిబంధనల ప్రకారం ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారని ఆ ప్రకటనలో తెలిపారు.

    ఇక ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆర్సీబీ మంచి ప్రదర్శనే చేసింది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో కేవలం రెండు ఓటములే పొందిన ఆర్సీబీ మొత్తంగా 10 పాయింట్లు సాధించి మూడో స్థానంలో ఉన్నది. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా సాధించని బెంగళూరు జట్టు ఈ సారి టైటిల్ మీద కన్నేసింది. ఆర్సీబీ జట్టు ఒక సీజన్‌లో వరుస విజయాలు సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

    మరోవైపు ఐపీఎల్ 2021 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆర్సీబీ జట్టులో కీలక ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా రెండో ఫేజ్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ఇప్పటికే ఆర్సీబీ జట్టు కోచ్ సైమన్ కటిచ్‌తో సహా పలువురు విదేశీ క్రికెటర్లు రెండో దశకు అందుబాటులో ఉండమని చెప్పారు. అలాంటి సమయంలో ఆల్‌రౌండర్ సుందర్ దూరం కావడం జట్టుకు పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పుకోవచ్చు. భారత జట్టుతో కలసి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన వాషింగ్టన్ సుందర్.. దుర్హమ్‌లో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడ్డాడు. దీంతో టీమ్ మేనేజ్‌మెంట్ అతడిని తిరిగి ఇండియా పంపించేసింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాషింగ్టన్ సుందర్ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు.

    Published by:John Kora
    First published:

    Tags: IPL 2021, Virat kohli

    ఉత్తమ కథలు