Home /News /sports /

RCB IPL PLAYERS EVEN IF RCB BUYS THESE ARE THE FIVE PLAYERS WHO HAVE NOT PLAYED A SINGLE MATCH GH EVK

RCB IPL Players: ఆర్‌సీబీ కొనుగోలు చేసినా.. ఒక్క మ్యాచ్ కూడా ఆడని ఐదుగురు ఆటగాళ్లు వీరే!

ఐపీఎల్ క్రికెట‌ర్లు

ఐపీఎల్ క్రికెట‌ర్లు

Royal Challengers Bangalore | టాప్ క్రికెట్ ఈవెంట్ ఐపీఎల్‌లో ఆర్‌సీబీ క్రేజ్ ఎక్కువ‌. ఆర్‌సీబీ ఫ్రాంచైజీ కొనుగోలు చేసిన ప్లేయర్లందరికీ కనీసం ఒక మ్యాచ్ అయినా ఆడే ఛాన్స్ వచ్చింది కానీ ఐదుగురు ప్లేయర్లకు మాత్రం ఆర్‌సీబీ తరఫున సింగిల్ మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు.. వారెవ‌రో తెలుసా..

ఇంకా చదవండి ...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) 2008లోనే చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి జరిగిన ప్రతి ఐపీఎల్ సీజన్‌లో ఆర్‌సీబీ ఆడింది. బెంగళూరుకు చెందిన ఈ ఫ్రాంచైజీ అనేకసార్లు ప్లేఆఫ్‌లకు అర్హత సాధించింది. మూడుసార్లు ఫైనల్‌కు కూడా చేరుకుంది. కానీ ఇప్పటివరకైతే ఆర్‌సీబీ ఐపీఎల్ కప్(IPL Trophy)ను ముద్దాడలేదు. విశేషమేంటంటే.. ఆర్‌సీబీ జట్టు తరుఫున విరాట్ కోహ్లీ (Virat Kohli), ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, యువరాజ్ సింగ్ (Yuvraj Singh), అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid), శివనారాయణ్ చంద్రపాల్, బ్రెండన్ మెకల్లమ్, కెవిన్ పీటర్సన్, రాస్ టేలర్.. ఇలా చాలామంది స్టార్ క్రికెటర్లు ఆడారు. అయినప్పటికీ టైటిల్ గెలవకపోవడం గమనార్హం.

అయితే ఆర్‌సీబీ ఫ్రాంచైజీ కొనుగోలు చేసిన ప్లేయర్లందరికీ కనీసం ఒక మ్యాచ్ అయినా ఆడే ఛాన్స్ వచ్చింది కానీ ఐదుగురు ప్లేయర్లకు మాత్రం ఆర్‌సీబీ తరఫున సింగిల్ మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు! నమ్మడానికి కష్టంగా ఉన్నా ఈ ఐదుగురు ఆటగాళ్లకు కనీసం RCB జెర్సీని కూడా ధరించే అదృష్టం దక్కలేదు. ఇంతకీ ఆ ప్లేయర్లు ఎవరు? ఏ సీజన్​లో ఆడారు? తెలుసుకుందాం.

MS Dhoni : పాకిస్థాన్ బౌలర్ కి అదిరిపోయే బహుమతి ఇచ్చిన ధోనీ.. ఆ ప్లేయర్ రియాక్షన్ ఏంటంటే..


1. నువాన్ ప్రదీప్ - ఐపీఎల్ 2011
ఆర్‌సీబీ 2011 ఐపీఎల్ సీజన్ కోసం శ్రీలంక (Sri Lanka) ఫాస్ట్ బౌలర్ అయిన నువాన్ ప్రదీప్‌(Nuwan Pradeep)ను కొనుగోలు చేసింది. ప్రదీప్ అప్పటికి శ్రీలంక తరఫున వైట్‌బాల్‌/ పరిమిత ఓవర్ల క్రికెట్లో అరంగేట్రం చేయలేదు. దీంతో ఇతన్ని ఆర్‌సీబీ ఎందుకు తీసుకుందో తెలియక అందరూ అవాక్కయ్యారు. ఊహించినట్లుగానే, నువాన్ ప్రదీప్‌ సీజన్ ముగిసేవరకు ఆర్‌సీబీ (RCB)లో ఒక సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్ గానే మిగిలిపోయాడు. అతనికి ఒక్క మ్యాచ్ ఆడే ఛాన్స్ కూడా దక్కకపోవడం గమనార్హం. ఆ తరువాత ఆర్‌సీబీ ఫ్రాంచైజీ ప్రదీప్‌ను తమ జట్టు వదిలించుకుంది.

IPL: ఐపీఎల్‌లో సూప‌ర్ హిట్‌.. త‌రువాత మాయ‌మై ఎక్క‌డికి పోయారు ఈ క్రికెట‌ర్లు!


2. నాథన్ బ్రాకెన్ - ఐపీఎల్ 2008
ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ గా నాథన్ బ్రాకెన్ (Nathan Bracken) వెలుగొందాడు. 2007లో వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టులో నాథన్ బ్రాకెన్ ఒక ప్లేయర్ గా ఉన్నాడు. ఎడమచేతి వాటం పేసర్ అయిన నాథన్ 50 ఓవర్ల ప్రపంచకప్ గెలిచిన ఒక ఏడాది తర్వాత.. అంటే 2008 ఐపీఎల్ (IPL) సీజన్ కోసం ఆర్‌సీబీ నుంచి ఐపీఎల్ కాంట్రాక్ట్ అందుకున్నాడు. కానీ ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా అతనికి దక్కలేదు. ఆర్‌సీబీ అతన్ని 2009 సీజన్‌లో కూడా తన జట్టులో ఉంచుకుంది. కానీ బ్రాకెన్ గాయాల కారణంగా జట్టు కోసం ఎప్పుడూ ఆడలేదు. మోకాలి గాయంతో అతడు 2011లో ఆస్ట్రేలియా (Australia) క్రికెట్ జట్టుకు కూడా శాశ్వతంగా దూరం అయ్యాడు.

3. సుబ్రమణ్యం బద్రీనాథ్ - ఐపీఎల్ 2015
భారత మాజీ బ్యాటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ (Subramaniam Badrinath) 2015లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేరాడు. అంతక్రితం అతడు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 95 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. బద్రీనాథ్‌కు ఐపీఎల్‌లో గొప్ప రికార్డు ఉన్నప్పటికీ, ఆర్‌సీబీ అతనిని ఏ మ్యాచ్‌కూ ఎంపిక చేయలేదు. తర్వాత ఇదే అతని చివరి ఐపీఎల్ అయింది.

4. స్టీవ్ స్మిత్ - ఐపీఎల్ 2010
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్‌లలో ఒకడిగా ఉన్న స్టీవ్ స్మిత్ (Steve Smith) 2010లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేరాడు. అప్పటికే అతను లెగ్ స్పిన్ బౌలర్ గా కొత్తగా ఆస్ట్రేలియాలో చేరాడు. తర్వాత మెరుగైన బ్యాటింగ్ కూడా చేస్తూ ఆల్ రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే స్మిత్ కు ఆర్‌సీబీ ఫ్రాంచైజీకి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. 2011లో వేలానికి ముందు అతన్ని బెంగళూరు జట్టు విడిచిపెట్టింది. ఈ వేలంలో అతను కొచ్చి టస్కర్స్ కేరళ జట్టులో చేరాడు. కానీ ఈ జట్టు తరఫున కూడా ఆడే ఛాన్స్ రాలేదు. మరుసటి ఏడాదిలో అతన్ని పుణె వారియర్స్ ఎంపిక చేసుకుంది. అలా 2012లో తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ స్మిత్ ను వదిలేసుకుంది.

5. నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ - ఐపీఎల్ 2018
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ నాథన్ కౌల్టర్ నైల్‌ (Nathan Coulter Nile)ను ఐపీఎల్ 2018 సీజన్ కోసం ఆర్‌సీబీ తీసుకుంది. 2019 సీజన్‌లో కూడా అతన్ని ఎంపిక చేసుకుంది. కానీ ఈ ఆసీస్ స్టార్ గాయం కారణంగా జట్టు కోసం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు.
Published by:Sharath Chandra
First published:

Tags: Cricket, IPL, Royal Challengers Bangalore, T20

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు