మాస్క్ పెట్టుకోమన్నందుకు పోలీస్‌తో రవీంద్ర జడెజా భార్య వాగ్వివాదం

Ravindra Jadeja's Wife

భారత క్రికెట్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా భార్య పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాజ్‌కోట్‌లో జడేజా తన భార్య రివిబాతో కలిసి సోమవారం రాత్రి 9. గంటలకు కారులో వెళ్తుండగా పోలీసులు వారి వాహనాన్ని ఆపారు.

  • Share this:
    భారత క్రికెట్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా భార్య పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాజ్‌కోట్‌లో జడేజా తన భార్య రివిబాతో కలిసి సోమవారం రాత్రి 9. గంటలకు కారులో వెళ్తుండగా పోలీసులు వారి వాహనాన్ని ఆపారు. వారిని తనిఖీ చేసేందుకు మహిళా కానిస్టేబుల్‌ సోనాల్‌ గోసాయ్‌ కారు దగ్గరకు వెళ్ళారు. జడేజా మాస్క్‌ ధరించి ఉన్నప్పటికీ అతని భార్య మాస్క్‌ ధరించలేదు. ఎందుకు మాస్క్‌ ధరించలేదని ఆమెను ప్రశ్నించి,జరిమానా చెల్లించాలని కోరారు. దీంతో ఒక్కసారిగా కానిస్టేబుల్‌‌తో వాదన దిగింది రివిబా. ఈ విషయాన్ని డీసీపీ మనోహర్‌ సింగ్‌ మీడియాకు తెలిపారు.

    తమ ప్రాథమిక దర్యాప్తులోని పలు వివరాలను వెల్లడించారు. జడేజా భార్య రవిబా మాస్క్‌ ధరించలేదని దిన్ని అడిగినందుకు కానిస్టేబుల్‌‌తో ఆమె వాగ్వాదానికి దిగారని తెలిపారు. ఘర్షణ అనంతరం మహిళా కానిస్టేబుల్‌ స్వల్ప అస్వస్థతకు గురైనదని దీంతో స్థానిక ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిపారు. వీరి మధ్య గొడవ ఎందుకు పెద్దదయ్యిందనే విషయంపై దర్యాప్తు జరుగుతుందని వివరించారు.
    Published by:Rekulapally Saichand
    First published: