Cricket : మంజ్రేకర్ ఆ రోజు దొరికుంటే ఏం జరిగేదో? కామెంట్రీ బాక్స్‌లో వెతికిన రవీంద్ర జడేజా

వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్‌లో ఏం జరిగింది?

జడేజా ఆ రోజు మంజ్రేకర్ కోసం వెతికాడా? అసలు వారి వివాదం ఎలా మొదలైంది? రవీంద్ర జడేజా తన మనసులో మాటను బయటపెట్టాడు. అందేంటంటే..

  • Share this:
    టీమ్ ఇండియా (Team India) ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. కానీ మూడేళ్ల క్రితం మాత్రం అతడి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉండేది. వన్డే జట్టులో స్థానం కోల్పోయి.. టెస్టు జట్టులో బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఆ సమయంలో ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లినా తుది జట్టులో స్థానం లేక తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. జట్టులోకి తిరిగి ఎలా రావాలా అని తాను చాలా ఆలోచించానని.. అలా నిద్రలేని రాత్రులు చాలా గడిపానని జడేజా చెప్పాడు. కాగా, రవీంద్ర జడేజాకు సంజయ్ మంజ్రేకర్‌కు మధ్య ఆ మధ్య విభేదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఒక మ్యాచ్ సందర్భంగా రవీంద్ర జడేజాను కించ పరుస్తూ మంజ్రేకర్ (Sanjau Manjrekar) 'బిట్స్ అండ్ పీసెస్' క్రికెటర్ అంటూ విమర్శించాడు. అంతే ఏదో అప్పుడప్పుడు రాణిస్తాడు తప్ప అతడిలో పెద్దగా టాలెంట్ లేదని చులకనగా కామెంట్ చేశాడు. ఆ విషయాన్ని మంజ్రేకర్ ట్విట్టర్‌లో కూడా పోస్టు చేశాడు. దీనికి రవీంద్ర జడేజా కూడా ఘాటుగా స్పందించాడు. 'మంజ్రేకర్ నీ నోటి విరేచనాలు ఆపు' అంటూ ట్వీట్ చేశాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మనస్పర్దలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆనాటి సంఘటనలను రవీంద్ర జడేజా మీడియాతో పంచుకున్నాడు. వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చాడు.

    'నాకు, మంజ్రేకర్‌కు మధ్య ఉన్న గొడవ గురించి అందరికీ తెలుసు. నా క్రికెటింగ్ స్కిల్స్‌ను అవమానపరుస్తూ అతడు ఉద్దేశపూర్వకంగా కామెంట్ చేశాడు. అందుకే న్యూజీలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో నేను హాఫ్ సెంచరీ పూర్తిచేశాను. ఆ సమయంలో కామెంట్రీ బాక్స్ వైపు చూస్తూ బ్యాటును కత్తిలా తిప్పాను. అది ఎందుకు తిప్పాను అతడికి అర్దం అయ్యే ఉంటుంది. కానీ నా మనసులో మాట అలా చెప్పాలనుకున్నాను' అని జడేజా అన్నాడు. మ్యాచ్ పూర్తయిన తర్వాత కూడా కామెంట్రీ బాక్స్ వైపు వెళ్లి చూడాలనుకున్నాను. కానీ కుదరలేదు. ఒకవేళ మంజ్రేకర్ కనుక అక్కడ దొరికి ఉంటే ఏం జరిగేదో నాకు తెలియదు. అయితే దురదృష్టవశాత్తు మేము ఆ మ్యాచ్ గెలవలేదు. దీంతో నిరాశలో ఉండిపోయాను అని జడేజా చెప్పాడు.

    Cricket : పాకిస్తాన్ జట్టులో సచిన్.. క్రికెట్‌లో కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుసుకుంటే మీరు అవాక్కవ్వాల్సిందే

    న్యూజీలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జడేజా కేవలం 59 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ధోనీ (50)తో కలసి ఏడో వికెట్‌కు 116 పరుగులు చేశాడు. కానీ వీరిద్దరినీ అవుట్ చేయడంతో ఇండియా 49.3 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌట్ అయ్యింది. న్యూజీలాండ్ జట్టు 18 పరుగులతో గెలిచి ఫైనల్‌కు చేరుకున్నది.
    Published by:John Naveen Kora
    First published: