క్రీడా పురస్కారాలు.. అర్జున అవార్డుకు నామినేట్ అయిన రవీంద్ర జడేజా..

రవీంద్ర జడేజా

కేంద్రప్రభుత్వం తరఫన అందించే క్రీడా పురస్కారాలకు పేర్లు నామినేట్ అయ్యాయి. వివిధ విభాగాల్లో సుమారు 37 పేర్లను కమిటీ ప్రతిపాదించింది.

 • Share this:
  కేంద్రప్రభుత్వం తరఫన అందించే క్రీడా పురస్కారాలకు పేర్లు నామినేట్ అయ్యాయి. వివిధ విభాగాల్లో సుమారు 37 పేర్లను కమిటీ ప్రతిపాదించింది. క్రీడా పురస్కారాలపై ఏర్పాటైన సెలక్షన్ కమిటీ ఆగస్ట్ 16, 17 తేదీల్లో సుదీర్ఘంగా చర్చించింది. వివిధ క్రీడా రంగాల్లో ప్రతిభ చూపిన వారి పేర్లను పలు అవార్డులకు ప్రతిపాదించింది. దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారంగా పేరొందిన రాజీవ్ ఖేల్ రత్న పురస్కారానికి బజరంగ్ పూనియా (రెజ్లింగ్), దీపా మాలిక్ (పారా అథ్లెటిక్స్) పేర్లను సూచించింది. ద్రోణాచార్య పురస్కారానికి ముగ్గురు కోచ్‌ల పేర్లను ప్రతిపాదించింది. విమల్ కుమార్ (బ్యాడ్మింటన్), సందీప్ గుప్తా (టేబుల్ టెన్నిస్), మహీందర్ సింగ్ థిల్లాన్ (అథ్లెటిక్స్) పేర్లను సూచించింది. అర్జున అవార్డు కోసం మొత్తం 19 పేర్లను సూచించింది కమిటీ. అందులో క్రికెటర్ రవీంద్ర జడేజా పేరు కూడా ఉంది. అథ్లెటిక్స్, క్రికెట్, బాడీ బిల్డింగ్, షూటింగ్, కబడ్డీతో పాటు వివిధ క్రీడల్లో ప్రతిభ చూపిన వారి పేర్లను ప్రతిపాదించింది.

  క్రీడా పురస్కారాలకు నామినేట్ అయిన జాబితా


  రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహ పురస్కారంలో క్రీడాసంస్థల పేర్లను కూడా సూచింది. ఈ కేటగిరీలో యువ టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహిస్తున్న గగన్ నారంగ్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఫౌండేషన్, GO స్పోర్ట్స్ పేర్లు సూచించింది. క్రీడాభివృద్ధికి పాటుపడుతున్న విభాగంలో రాయలసీమ డెవలప్‌మెంట్ ట్రస్ట్ పేరును సెలక్షన్ కమిటీ ప్రతిపాదించింది.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: