ravindra jadeja: జడేజా గాయాన్ని మెుదటిగా గమనించింది అతనే

Ravindra jadeja

రవీంద్ర జడేజాకు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా యుజువేంద్ర చహల్ బరిలోకి దింపడంపై ఇంకా విమర్శలు వినిపిస్తునే ఉన్నాయి. తొలి టీ20 మ్యాచ్‌లో గాయపడిన జడేజాకు స్థానంలో చాహాల్‌ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే

  • Share this:
    రవీంద్ర జడేజాకు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా యుజువేంద్ర చహల్ బరిలోకి దింపడంపై ఇంకా విమర్శలు వినిపిస్తునే ఉన్నాయి. తొలి టీ20 మ్యాచ్‌లో గాయపడిన జడేజాకు స్థానంలో చాహాల్‌ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై మిశ్రమ వాదనలు వినిపించాయి మ్యాచ్ సమయంలో కోచ్‌ లాంగర్‌.. మ్యాచ్‌ రిఫరీ బూన్‌తో వాదనకు దిగాడు. రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్‌. అతను రెగ్యులర్ బౌలర్‌ కాదు అలాంటప్పుడు చాహల్‌ లాంటి రెగ్యులర్‌ బౌలర్‌‌ను ఎలా సబ్‌స్టిట్యూట్‌’గా అనుమతిస్తారు అంటూ రిఫరిపై కోచ్‌ లాంగర్‌ మండిపడ్డారు. జడేజా స్థానంలో ‘కన్‌కషన్‌ సబ్‌స్టిట్యూట్‌’గా చహల్‌ను అనుమతించడం సరైన విధానం కాదని మరికొందరు సీనియర్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఒకవేళ జడేజా ఉన్నా కూడా నాలుగు ఓవర్లు వేసేవాడని అలాంటప్పుడు ఇది ఎలా తప్పు అవుతుందని మరికొందరి నుంచి సమర్థనీయమైన వాదనను వినిపించారు. అలాగే చాహల్‌ను అనుమతించడంపై రిఫరీ కూడా తనకు తానుగా సమర్ధించుకుంటున్నాడు.

    క్రికెట్‌లోని కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ లోసుగును వాడుకుని టీమిండియా చహాల్‌ను బరిలోకి దింపిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.  ఈ విషయంపై బీసీసీఐ స్పందించింది. " రవీంద్ర జడేజాకు గాయమైన సంగతి ముందుగా చూసిన సంజూ శాంసన్ మయాంక్ ఈ విషయం చెప్పాడు. వెంటనే స్పందించిన మయాంక్.. మేనేజ్‌మెంట్‌కు సమాచారం అందించాడు. ఆ వెంటనే టీం వైద్యున్ని జడేజా దగ్గరకు పంపించి తల, మెడ భాగంలో పరిశీలించారు. అప్పుడు జడేజా పరిస్థితి ఆందోళన కరంగానే కనిపించింది. మ్యాచ్ తర్వాత  జడేజా తనకు అసౌకర్యంగా ఉందని చెప్పినట్లు" బీసీసీఐ సీనియర్ అధికారి వివరించారు. దీంతో జడేజా పరిస్ధితిపై రిఫరీ డేవిడ్ బూన్‌ను తెలిపమని స్పష్టం చేశారు. వారు సూచన మేరకే చాహాల్‌ను రంగంలోకి దింపినట్లు వివరించారు.

    గత ఏడాది ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కాంకషన్ సబ్‌స్టిట్యూట్ నిబంధనను అమల్లోకి తీసుకోచ్చింది. కాంకషన్‌కి గురైన ఆటగాడి స్థానంలో వచ్చే క్రికెటర్ బ్యాటింగ్, బౌలింగ్‌లో చేయోచ్చు.
    Published by:Rekulapally Saichand
    First published: