Ravindra Jadeja: ధోనీని వెనక్కు నెట్టేసిన జడేజా...గురువును మించిపోయాడుగా...

జడేజా (Ravindra Jadeja) మాత్రం భారత మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోనీని, క‌పిల్ దేవ్‌ల రికార్డులను బద్దలు కొట్టాడు. జట్టులో ఏడో నెంబర్ బ్యాట్స్‌మెన్ గా బరిలోకి దిగి అత్యధిక హాఫ్ సెంచ‌రీలు చేసిన టీమిండియా ఆటగాడుగా జడేజా (Ravindra Jadeja) చరిత్ర సృష్టించాడు.

news18-telugu
Updated: February 8, 2020, 10:33 PM IST
Ravindra Jadeja: ధోనీని వెనక్కు నెట్టేసిన జడేజా...గురువును మించిపోయాడుగా...
భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా
  • Share this:
(Ravindra Jadeja)  న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు పరాజయం మూటగట్టుకుంది. 273 పరుగుల లక్ష్యచేదనలో తడబడిన టీమిండియా 251 ప‌రుగుల‌కే ఆలౌటైంది. అయితే ఈ మ్యాచ్ లో స్పెషల్ అట్రాక్షన్ మాత్రం ర‌వీంద్ర జ‌డేజా (55) నిలిచాడనే చెప్పాలి. మ్యాచ్ ఓడిపోయినప్పటికి జడేజా (Ravindra Jadeja) మాత్రం భారత మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోనీని, క‌పిల్ దేవ్‌ల రికార్డులను బద్దలు కొట్టాడు. జట్టులో ఏడో నెంబర్ బ్యాట్స్‌మెన్ గా బరిలోకి దిగి అత్యధిక హాఫ్ సెంచ‌రీలు చేసిన టీమిండియా ఆటగాడుగా జడేజా (Ravindra Jadeja) చరిత్ర సృష్టించాడు. జడేజా ఈ స్థానంలో 77 ఇన్నింగ్స్ లు ఆడి అందులో 26 సార్లు నాటౌట్‌గా నిలవగా, ఇక అందులో ఏడు హాఫ్ సెంచ‌రీలు చేసి ఈ ప్లేస్‌లో భార‌త అత్యుత్తమ బ్యాట్స్‌మ‌న్‌గా నిలిచాడు. ఇక అంతకుముందు ఈ స్థానంలో వచ్చి బ్యాటింగ్ చేసిన భార‌త ప్లేయ‌ర్ల జాబితాలో క‌పిల్ దేవ్, ఎంఎస్ ధోనీల‌తో క‌లిసి జడేజా స్థానం పంచుకున్నాడు. ఇప్పటివరకు ఏడో స్థానంలో వచ్చి కపిల్ దేవ్, ధోని ఆరు హాఫ్ సెంచరీలు చేశారు.

ఇదిలా ఉంటే న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా వన్డేల్లో మాత్రం చేతులెత్తేసింది.

తొలి వన్డేలో ఓటమి పాలైన టీమిండియా రెండో వన్డేలోనూ ఓటమి పాలై సిరీస్ చేజార్చుకుంది. ఓపెనర్లు వైఫల్యంతో పాటు మిడిలార్డర్ రాణించకపోవడంతో న్యూజిలాండ్‌ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్య ఛేదించకుండా తడబడి 48.3 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. దీంతో (India vs New Zealand) టీమిండియాపై న్యూజిలాండ్ జట్టు 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో న్యూజిలాండ్ జట్టు 2-0 ఆధిక్యంతో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. రవీంద్ర జడేజా (55), శ్రేయాస్ అయ్యర్ (52) హాఫ్ సెంచరీలతో రాణించి ఒంటరి పోరు చేసినప్పటికీ పార్ట్‌నర్‌షిప్స్ బిల్డ్ కాకపోవడంతో టీమిండియా ఓటమి పాలైంది. అయితే చివర్లో నవదీప్ సైనీ(45) మెరుపులు మెరిపించినప్పటికీ ఓటమి తప్పలేదు. ఇదిలా ఉంటే టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ను గప్టిల్‌-నికోలస్‌లు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 93 పరుగులు జోడించారు. న్యూజిలాండ్‌ జట్టులో మార్టిన్‌ గప్టిల్‌(79), నికోలస్‌(41), రాస్‌ టేలర్‌(73)లు రాణించగా, బ్లండెల్‌(22), జెమీసన్‌(25)లు రాణించడంతో కివీస్ గౌరవ ప్రదమైన స్కోరుసాధించింది. అయితే టీమిండియా బౌలర్లు పరిమితంగా పరుగులు ఇవ్వడంతో కివీస్‌ను మూడొందల మార్కును చేరకుండా నియంత్రించింది. దీంతో న్యూజిలాండ్‌ 274 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

తొమ్మిదో వికెట్‌కు టేలర్‌-జెమీసన్‌లు అజేయంగా 76 పరుగులు జత చేయడంతో కివీస్‌ గౌరవ ప్రదమైన లక్ష్యాన్ని భారత్‌ ముందుంచింది. టీమిండియా బౌలర్లలో చహల్‌ మూడు వికెట్లు సాధించగా, శార్దూల్‌ ఠాకూర్‌ రెండు వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజాకు వికెట్‌ దక్కింది.
First published: February 8, 2020, 10:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading