India vs South Africa: 200 వికెట్ల క్లబ్బులో రవీంద్ర జడేజా...మరో అరుదైన రికార్డు

జడేజా మొత్తం 44 టెస్టు మ్యాచులు ఆడగా, విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచులో ఈ 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. రవీంద్ర జడేజా కన్నా ముందు అశ్విన్ 37 టెస్టు మ్యాచుల్లో 200 వికెట్లు పడగొట్టి మొదటి స్థానంలో ఉన్నాడు.

Krishna Adithya | news18-telugu
Updated: October 4, 2019, 5:12 PM IST
India vs South Africa: 200 వికెట్ల క్లబ్బులో రవీంద్ర జడేజా...మరో అరుదైన రికార్డు
రవీంద్ర జడేజా (Image : Cricketnext)
  • Share this:
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కెరీర్ లో మరో రికార్డు సాధించాడు. టెస్ట్ క్రికెట్ మ్యాచుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లలో రెండో వాడిగా నిలిచాడు. జడేజా మొత్తం 44 టెస్టు మ్యాచులు ఆడగా, విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచులో ఈ 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. రవీంద్ర జడేజా కన్నా ముందు అశ్విన్ 37 టెస్టు మ్యాచుల్లో 200 వికెట్లు పడగొట్టి మొదటి స్థానంలో ఉన్నాడు. కాగా ఈ ఘనతను సాధించిన వారిలో హర్భజన్ సింగ్ 46 మ్యాచులు, అనిల్ కుంబ్లే 47 మ్యాచులు, బీఎస్ చంద్రశేఖర్ 48 మ్యాచుల్లో రెండు వికెట్ల మైలురాయిని అందుకున్న వారిలో ముందు వరుసలో నిలిచారు.

ఇక అటు ప్రపంచ రికార్డుల పరంగా చూసినా అత్యంత వేగంగా 200 వికెట్లు పడగొట్టిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లలో జడేజా అగ్రస్థానంలో ఉన్నాడు. జడేజా తర్వాత స్థానంలో శ్రీలంకకు చెందిన హేరత్ 47 మ్యాచులు, ఎంజీ జాన్సన్ (ఆస్ట్రేలియా) 49 మ్యాచులు, మిషెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) 50 మ్యాచులు, వసీం అక్రం(పాకిస్థాన్) 51 మ్యాచుల్లో ఈ మైలురాయిని అందుకొని తరువాతి స్థానాల్లో నిలిచారు.


First published: October 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading