గుజరాత్(Gujarat Election Result)లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. మోదీ (Narendra Modi), అమిత్ షా (Amit Shah) ఇలాఖాలో తమకు ఎదురులేదని మరోసారి నిరూపించింది. గతంలో ఎప్పుడూ లేనన్ని ఎక్కువ సీట్లు గెలిచి.. చారిత్రక విజయం సాధించిన బీజేపీ.. వరుసగా ఏడోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ సీట్లున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 92 సీట్లు అవసరమవగా.. బీజేపీ 156 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 17, ఆమాద్మీ 5 సీట్లలో విజయం సాధించింది. ఇతరులకు 4 స్థానాలు వచ్చాయి. బీజేపీకి ఏకంగా 156 సీట్లు రావడంతో.. వార్ వన్‌సైడ్ అయింది.
ఇక, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నార్త్ జామ్‌నగర్ నుంచి పోటీ చేసిన క్రికెటర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) భార్య.. రివాబా జడేజా (Rivaba Jadeja) ఘన విజయం సాధించారు. బీజేపీ టికెట్ పై పోటీ చేసిన రివాబా.. సమీప అభ్యర్థిపై 61,065 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నార్త్ జామ్‌నగర్ నియోజకవర్గంలో నమోదైన మొత్తం ఓట్లలో ఆమెకు 55% పైగా ఓట్లు వచ్చాయి. ఆమె తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అహిర్ కరాషన్భాయ్ పర్బత్భాయ్ కర్మూర్ (23.37%), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు చెందిన బిపేంద్రసిఘ్ చతుర్‌సిన్హ్ జడేజా (15.49%) ఉన్నారు.
ఇక, రివాబాకు మద్దతుగా రవీంద్ర జడేజా సైతం ప్రచారం చేశారు. గుజరాత్ ఎమ్మెల్యేగా ఎంపికైన తన సతీమణి రివాబా జడేజాను టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అభినందించాడు. బుధవారం వెలువడిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రివాబా జడేజా జామ్‌నగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఇక ట్విటర్ వేదికగా ఆమె విజయాన్ని ప్రస్తావించిన జడేజా.. 'హలో ఎమ్మెల్యే' అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. గుజరాతీలో ట్వీట్ చేసిన జడేజా.. ఈ విజయానికి రివాబా పూర్తి అర్హురాలని పేర్కొన్నాడు. జామ్ నగర్ నియోజకవర్గంలో పనులన్నీ వేగంగా జరిగిపోతాయని హామీ ఇచ్చిన జడేజా.. తన సతీమణిని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశాడు.
Hello MLA you truly deserve it. જામનગર ની જનતા નો વિજય થયો છે. તમામ જનતા નો ખુબ ખુબ દીલથી આભાર માનુ છુ. જામનગર ના કામો ખુબ સારા થાય એવી માં આશાપુરા ને વિનંતી. જય માતાજી???????? #મારુજામનગર pic.twitter.com/2Omuup5CEW
— Ravindrasinh jadeja (@imjadeja) December 9, 2022
అయితే, భార్య విజయం సందర్భంగా రవీంద్ర జడేజా చేసిన పని ఇప్పుడు విమర్శలకు దారి తీస్తుంది. రివాబా గెలవడంతో జడేజా గాల్లోకి డబ్బులు విసురుతూ సంబరాలు చేసుకుంటున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే.. కొందరు జడేజా తీరును విమర్శిస్తున్నారు. చేతికి డబ్బులివ్వకుండా అలా విసిరేయడం ఏంటని మండిపడుతున్నారు.
— Out Of Context Cricket (@GemsOfCricket) December 9, 2022
మరోవైపు.. భార్యను గెలిపించడానికే టీమిండియాకు దూరమయ్యాడని ఆరోపణలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. గాయం సాకుతో.. టీమిండియాకు ఆడని జడేజా.. భార్య తరఫున ప్రచారం ఎలా చేశాడని ప్రశ్నిస్తున్నారు. జడేజాను శాశ్వతంగా టీమిండియా నుంచి తప్పించాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Gujarat Assembly Elections 2022, Ravindra Jadeja, Viral Video