Ashwin : అశ్విన్‌పై ప్రశంసల వర్షం కురిపించిన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్..ఎందుకో తెలుసా..

అశ్విన్ - అలెక్స్ హార్ట్లీ

Ashwin : టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటాడు. ఎప్పటికప్పుడూ క్రికెట్ కు సంబంధించిన విషయాల్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటాడు.

  • Share this:
    టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటాడు. ఎప్పటికప్పుడూ క్రికెట్ కు సంబంధించిన విషయాల్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటాడు. తాజాగా మహిళల క్రికెట్ మ్యాచ్ పై అశ్విన్ ట్వీట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ అలక్స్ హార్టిలీ ప్రశంసల వర్షం కురిపించింది. నిన్న చివరి వరకు ఉత్కంఠగా సాగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టుపై దక్షిణాఫ్రికా మహిళల జట్టు విజయం సాధించింది. ప్రొటీస్ మిడిలార్డర్‌ బ్యాటర్‌ లౌరా వోల్వార్ట్‌ (39 బంతుల్లో 53 నాటౌట్‌; 7 ఫోర్లు) అజేయ అర్ధ శతకంతో జట్టును గెలిపించారు. అద్భుతంగా ఆడి దక్షిణాఫ్రికా జట్టును గెలిపించిన లౌరాను ప్రశంసిస్తూ ఆర్ అశ్విన్ ట్వీట్ చేశాడు. "లౌరాను ఎలా ఔట్ చేయాలి?. అమెకు సాఫ్ట్ సిగ్నల్ పంపించాలా?" అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు అలెక్స్ హార్ట్‌లీ స్పందించారు. "ఇదే మేం చూడాలనుకుంటున్నాం. అన్నింటికంటే ఇదే ముఖ్యమైనది. మహిళల ఆటపై నిజమైన ఆసక్తి కనబర్చిన అశ్విన్‌కు ధన్యవాదాలు. మిగతావారు కూడా ఇదే అనుసరించండి" అని అలగ్జాండ్రా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్ 4 వికెట్లకు 158 పరుగులు చేసింది. కెప్టెన్‌ స్మృతి మంధాన (7) త్వరగానే నిష్క్రమించినా.. మరో ఓపెనర్‌ షెఫాలీ వర్మ (47), హర్లీన్‌ డియోల్ (31) జట్టును ఆదుకున్నారు. అయితే 87/1తో ఉన్న స్థితి నుంచి 94/3తో భారత్‌ తడబడినా.. రిచా ఘోష్‌ (44 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి జట్టుకు మెరుగైన స్కోరు అందించింది. ఛేజింగ్ లో ఓపెనర్‌ లిజలీ (70) ధాటిగా ఆడడంతో దక్షిణాఫ్రికా విజయం దిశగా పయనించింది. ఆ తర్వాత లౌరా భారత జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దీంతో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.


    మరోవైపు అశ్విన్ ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో అదరగొట్టాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో సత్తా చాటి టీమిండియాకు అద్భుత విజయాల్ని అందించాడు. టెస్ట్ సిరీస్ లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు ఈ సీనియర్ స్పిన్నర్.
    Published by:Sridhar Reddy
    First published: